Jabardasth: జబర్దస్త్‌లో రోజా మళ్లీ మిస్సింగ్.. అసలేంటి కన్ఫ్యూజన్..?

జబర్దస్త్‌లో విచిత్రాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ వారం కనిపించిన జడ్జిలే వచ్చే వారం కనిపించడం లేదు. ఆ మధ్య అది బాగా జరిగింది. కానీ కొన్ని వారాలుగా రోజా, నాగబాబు వస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 10:00 PM IST
Jabardasth: జబర్దస్త్‌లో రోజా మళ్లీ మిస్సింగ్.. అసలేంటి కన్ఫ్యూజన్..?
‘రోజా’ ఫైల్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 10:00 PM IST
జబర్దస్త్‌లో విచిత్రాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ వారం కనిపించిన జడ్జిలే వచ్చే వారం కనిపించడం లేదు. ఆ మధ్య అది బాగా జరిగింది. కానీ కొన్ని వారాలుగా రోజా, నాగబాబు వస్తున్నారు. కానీ మళ్లీ ఈ వారం రోజా మిస్ అయింది. పూర్తిగా దూరమైందని కాదు కానీ గ్యాప్ అయితే తీసుకుంది. ప్రస్తుతం ఈమె రాజకీయంగా కూడా చాలా బిజీ. అందుకే ఓ వారం మళ్లీ బ్రేక్ తప్పలేదు. సోలోగా నాగబాబు జడ్జిమెంట్ ఇవ్వక తప్పలేదు. కాకపోతే ఈ మిస్సింగ్‌ను వరుణ్ తేజ్, హరీష్ శంకర్‌తో కవర్ చేసారు దర్శక నిర్మాతలు. వచ్చేవారం ఎపిసోడ్‌లో వాల్మీకి టీం వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది.

ఈ వారం తనొక్కడినే అంటూ నాగబాబు చెప్పిన వెంటనే.. మరో ముగ్గురిని తోడు తీసుకొస్తానంటూ రష్మీ గౌతమ్ చెప్పడంతో వరుణ్ అండ్ టీం ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పట్లాగే కామెడీ స్కిట్లు షురూ అయిపోయాయి. ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీ అయిపోయింది రోజా. అయినా కూడా తన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటుంది.. సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు పాలిటిక్స్ ప్లస్ షోలను బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. అప్పటి వరకు మధ్యమధ్యలో ఈ గ్యాప్‌లు తప్పవు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...