Home /News /movies /

JABARDASTH JUDGE ROJA SUPER PUNCH ON COMEDIAN DORABABU A LATEST PROMO GOES VIRAL SR

Jabardasth Dora Babu | Roja : జబర్దస్త్ దొరబాబు పరువు తీసిన రోజా.. పోలీసులు గురించి మాట్లాడుతూ..

రోజా దొరబాబు Photo : Facebook

రోజా దొరబాబు Photo : Facebook

Jabardasth Dora Babu | Roja : జబర్దస్త్ కామెడీ షో‌ ద్వారా పాపులరైనా దొరబాబు పరువు తీసింది ఆ షో జడ్డ్ రోజా సెల్వమణి.

    పాపులర్ ఈటీవీ కామెడీ షో జబర్దస్త్‌ షోకు సంబందించి ఏ వారానికి ఆవారానికి ఓ ప్రోమోను ఈటీవీ తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా జబర్దస్త్ ‌కు సంబందించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మొదట హైపర్ ఆది స్కిట్‌కు చెందిన సన్నివేశం రాగా.. హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచులతో రైజింగ్ రాజును ఆడేసుకున్నాడు. మన ప్రేమ రష్మి సుధీర్‌లకంటే కూడా గొప్పదని.. మనది ఎనిమిది సంవత్సరాలకు పైబడిన ప్రేమ అని.. ఈ విషయంలో రష్మి సుధీర్‌లు పనికిరారని అంటాడు రైజింగ్ రాజు. దీంతో హైపర్ ఆది కలిగించుకుని అవును మీప్రేమ గుడ్డిదికాదు.. ముసలిప్రేమ అంటూ పంచువిసురుతాడు. ఇక్కడ రోజా కూడా ఓ అదిరిపోయే పంచు విసిరింది. ఇక ఆ తర్వాత వచ్చిన దొరబాబు స్కిట్‌లో భాగంగా ఎక్కువ చేస్తే జైళ్లో వేస్తాం.. దొరబాబును ఉద్దేశిస్తూ పోలీసులు ఆ మాటలు అనగానే జైలు నాకు కొత్తేంకాదు అంటూ ముందుకు వస్తాడు దొరబాబు. ఇదే సమయంలో రోజా కూడా జైలు పోలీసులు అలవాటైపోయారు అంటూ పంచు విసిరింది. దీంతో అందురూ నవ్వులు చిందించారు. రోజా విసిరిన పంచుకు అనసూయతో పాటు అందరూ కేవ్వుమన్నారు. దీనికో రీజన్ ఉంది. దొరబాబు గతంలో ఓ కేసులో చిక్కుకోని కేసుల పాలైయాడు. అది దృష్టిలో పెట్టుకుని ఈ పంచు విసిరారు.

    ఇక చివరగా తాగుబోతు రమేష్ స్కిట్ రాగా.. తన ఏజ్ గురించి ఇండ్రక్షన్ ఇచ్చిన రమేష్ ఆతర్వాత ఓ అమ్మాయితో తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయబోతూ ఇంప్రెస్ చేసే క్రమంలో కొన్ని డైలాగులు కొడతాడు.. అందులో భాగంగా.. రమేష్ ఆ అమ్మాయిని ఉద్దేశిస్తూ.. నీ చీరలు ఆరేసే అదృష్టం నా దండానికి ఇస్తావా.. నీ అందాన్ని చూసుకునే అదృష్టం నా ఇంట్లో ఉన్న అద్దానికి ఇస్తావా.. అనగానే అక్కడ ఉన్న అమ్మాయి కోపంగా నీ చెంపను తాకే అదృష్టం నా చెప్పుకు ఇస్తావా అంటూ రమేష్ ప్రేమను అవమాన పరుస్తుంది. అయితే ఇదంతా స్కిట్‌లో భాగంగా ప్రేక్షకులను అలరించడానికి సరదాగా చేసారు. ఇక అలా తాజా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో నవ్వులను చిందిస్తోంది. ప్రస్తుతం ఈ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Jabardasth comey show, Tollywood Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు