రోజా దారెటు.. ఆమె నిర్ణయంపై ఉత్కంఠ..

రోజా జబర్దస్త్‌ షోలో జడ్జిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే.. ఈ మధ్య ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆమెపై బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె జబర్దస్త్‌కు గుడ్‌బై చెబుతారని అనుకున్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 2:19 PM IST
రోజా దారెటు.. ఆమె నిర్ణయంపై ఉత్కంఠ..
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
జబర్దస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు, ప్రధాన టీమ్ లీడర్లు తప్పుకున్నారు. వీళ్లు మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్న ఈ కామెడీ షో నుంచి తప్పుకొని ఓ ఛానల్ ప్రారంభించబోతున్న మరో షోలో ప్రత్యక్షం కానున్నారు. ఆ బృందంలో నాగబాబుతో పాటు.. హైపర్ ఆది, అనసూయ, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర.. తదితరులు ఉన్నట్లు సమాచారం. అయితే.. నాగబాబుతో పాటు మరో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యేగా కొనసాగిన రోజా.. జబర్దస్త్ కార్యక్రమాన్ని సాఫీగానే చేసుకున్నారు. అయితే.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెపై బాధ్యత పెరిగినట్లైంది. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచినా జబర్దస్త్ కార్యక్రమాన్ని కొనసాగించారు. దాని గురించి సీఎం జగన్ ఆమెను ఆరా తీసినట్లు, షో నుంచి తప్పుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ఇప్పటి వరకు జడ్జిగా కొనసాగుతూ వచ్చారు. అయితే.. ఈ మధ్య ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆమెపై బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె జబర్దస్త్‌కు గుడ్‌బై చెబుతారని అనుకున్నారు. ఆమె కూడా షో నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఇప్పుడు.. ఏకంగా జబర్దస్త్ టీమ్‌ దాదాపు వేరే ఛానల్‌కు షిఫ్ట్ అవుతుండటంతో రోజా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇంతకుముందే షో నుంచి తప్పుకోవాలని ఆమె భావించారని, అయితే.. షో ద్వారా మంచి ఫాలోయింగ్ రావడంతో తప్పుకోవడానికి సంకోచించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాగబాబు తప్పుకోవడంతో ఇదే తరుణం అనుకొని ఆమె కూడా షో నుంచి దూరం అవుతారా? లేక ఒక్కరే షోను ముందుండి నడిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు