హైపర్ ఆది.. జబర్దస్త్‌కు రాకముందు ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్‌కు వచ్చాడో.. ఇక అప్పటినుండి అదిరిపోయే పంచులతో కేకపెట్టిస్తున్నాడు. మొదట కొన్నాళ్లు టీమ్‌లో ఓ మెంబర్‌గా చేసిన ఆది.. ఆ తర్వాత సొంతంగా ఓ టీమ్‌ను చేసుకుని రైజింగ్ రాజు సాయంతో కామెడీని బాగానే పండిస్తున్నాడు. తన కామెడీలో కొంత ఆశ్లీలం ఉన్నా.. మాస్ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇక జబర్దస్త్ ఇచ్చిన పాపులారిటీతో ఆది వివిధ షోలకు కూడా యాంకరింగ్ చేస్తున్నాడు. అందులో భాగంగా మరో మల్లేమాల ప్రోడక్షన్ ఢీ డాన్స్ షోలో ఓ టీమ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో కొన్నాళ్లు యాంకర్ వర్షిణీతో జంటగా అలరించిన ఆది.. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్‌తో అలరిస్తున్నాడు. అయితే సడెన్‌గా ఆ షో నుంచి వర్షిణీ స్ధానంలో మరో కొత్త అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి పేరు దీపికా పిల్లి.. అయితే వర్షిణీతో ఉన్నా కెమిస్ట్రీ.. ఈ భామతో కుదరట్లేదు. ఇక అది అలా ఉంటే తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది.. ఓ ఇంట్లో దొంగతనానికి వస్తాడు.
ఆ ఇల్లు ఎవరిదో కాదు.. జబర్దస్త్ జడ్జ్ రోజాది. రోజా ఇంట్లోలేని సమయంలో దొంగతనానికి వచ్చిన హైపర్ ఆది.. ఇంటి సభ్యులకు దొరికిపోతాడు. వీరిని ఓ గదిలో బంధించి ఉంచుతారు. ఆ తర్వాత కొద్ది సేపటికి రోజా వస్తుంది.
ఇక ఇది చూసిన రోజా హైపర్ ఆది, అతని తోడు దొంగపై విరుచుకుపడుతుంది. కోపంతో ఊగిపోతూ.. మాఇంట్లో దొంగతనానికి వస్తారా.. మిమ్మల్నీ ఏం చేయాలి. మటన్‌ను కత్తితో కొట్టినట్లు.. ఆ కత్తితో మిమ్మల్ని కొట్టాలా.. లేక కొడవలితో గడ్డని కోసినట్లు కోయాలా, లేక రోకలితో కారంపొడి దంచినట్లు దంచాలా అంటూ మండిపడుతూ బెదిరిస్తుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఆది బిత్తరపోతాడు. అయితే ఇదంతా సరదాకోసమే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రోమోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 28న ఈటీవీలో ప్రసారం కానుంది.
Published by:Suresh Rachamalla
First published:January 24, 2021, 11:31 IST