హోమ్ /వార్తలు /సినిమా /

Sudigaali Sudheer-Roja: సుడిగాలి సుధీర్‌ ఆ సినిమాలో అలా.. రోజా షాకింగ్ కామెంట్స్

Sudigaali Sudheer-Roja: సుడిగాలి సుధీర్‌ ఆ సినిమాలో అలా.. రోజా షాకింగ్ కామెంట్స్

సుధీర్, రోజా (Image: Youtube)

సుధీర్, రోజా (Image: Youtube)

Sudigaali Sudheer-Roja: జబర్ధస్త్‌లో కంటిన్యూ అవుతూనే అనేక సినిమాల్లో నటించిన సుధీర్.. ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ సహా పలు సినిమాల్లో నటించాడు.

  జబర్ధస్త్ టాప్ స్టార్స్‌లో సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హైపర్ ఆదితో పాటు జబర్ధస్త్‌ను ఎప్పటిప్పుడు టాప్ రేంజ్‌లో ఉంచడంలో సుడిగాలి సుధీర్, అతడి టీమ్ ఎంతో కష్టపడుతుంటుంది. తన టీమ్ స్కిట్స్‌తో పాటు ఇతర టీమ్స్‌లోనూ సుధీర్ కనిపిస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో తళుక్కుమన్న సుడిగాలి సుధీర్.. ఈ స్కిట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడని.. ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. స్కిట్‌లో హీరోగా కనిపించిన సుధీర్ రెమ్యూనరేషన్ గురించి జరిగిన చర్చ కామెడీ పండించనుంది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ జడ్జి రోజా సుడిగాలి సుధీర్‌పై వేసిన పంచ్ బాగా పేలింది.

  సుడిగాలి సుధీర్ కొద్దిసేపు కనిపించిన రేసుగుర్రం సినిమా గురించి ప్రస్తావించిన రోజా.. ఆ సినిమాతో సుధీర్ గెస్ట్ రోల్ చేశాడనే విషయాన్ని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో సుధీర్ ఎంత సేపు కనిపించాడనే విషయాన్ని చెప్పడానికి తన కుమారుడు కౌశిక్ ప్రస్తావన తీసుకొచ్చారు. రేసుగుర్రం సినిమాలో సుధీర్ నటించాడని.. ఆ సినిమాలో కారు తూడుస్తూ ఒక్క షాట్‌లో ఉన్నాడని వివరించాడు. తన కొడుకు కౌశిక్‌కు సుధీర్ ఉన్నాడని చూపించేలోపే అతడు వెళ్లిపోతాడని పేర్కొన్నారు. ఆ రకంగా రేసుగుర్రం సినిమాలో సుధీర్ క్యారెక్టర్ చాలా తక్కువ సేపు ఉంటుందని సెటైరికల్‌గా వివరించారు.

  జబర్ధస్త్‌లో కంటిన్యూ అవుతూనే అనేక సినిమాల్లో నటించిన సుధీర్.. ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ సహా పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గతంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో కనిపించిన సుధీర్.. ఇప్పుడు మాత్రం హీరోగా రాణించేందుకు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి రేసుగుర్రం పేరు చెప్పిన సుడిగాలి సుధీర్‌పై సాలిడ్ సెటైర్ వేసిన రోజా.. స్కిట్‌లో అతడిని ఇంకెంతగా టార్గెట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Jabardasth, Roja Selvamani, Sudigali sudheer

  ఉత్తమ కథలు