హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya Bharadwaj: అనసూయ సీక్రెట్ లీక్.. జబర్ధస్త్‌లో అంతా చూస్తుండగానే..

Anasuya Bharadwaj: అనసూయ సీక్రెట్ లీక్.. జబర్ధస్త్‌లో అంతా చూస్తుండగానే..

అనసూయ

అనసూయ

Anasuya Bharadwaj: స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఓ వైపు వెండితెరపై రాణిస్తూనే ఎంతమంది కొత్త యాంకర్లు పుట్టుకొచ్చినా.. బుల్లితెరపై కూడా తిరుగులేకుండా రాణిస్తోంది.

  టాలీవుడ్ స్టార్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. జబర్ధస్త్ ద్వారా స్టార్ యాంకర్ రేంజ్‌కు ఎదిగిన అనసూయ... సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. నటిగా గుర్తింపు సాధిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఓ వైపు వెండితెరపై రాణిస్తూనే ఎంతమంది కొత్త యాంకర్లు పుట్టుకొచ్చినా.. బుల్లితెరపై కూడా తిరుగులేకుండా దూసుకుపోతోంది. అలాంటి అనసూయ సంపాదన మీద ఎప్పటికప్పుడు అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె లైఫ్ స్టయిల్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తుంటాయి. తాజాగా అనసూయ సంపాదన గురించి జబర్థస్త్‌లో ఓ ఆసక్తిక కామెంట్ చేసింది నటి, ప్రొగ్రామ్ జడ్జి రోజా.

  వివరాల్లోకి వెళితే.. తదుపరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో అనసూయకు ఏ బుక్ అని అడుగుతాడు అధిరే అభి. ఇందుకు ఆమె తనకు తన భర్త చెక్ బుక్ ఇష్టమని చెబుతోంది. ఇంత సంపాదిస్తున్నా.. భర్త చెక్ బుక్ మీదే కన్ను అంటూ అధిరే అభి అనసూయ గురించి కామెంట్ చేస్తాడు. అయితే దీనిపై స్పందించిన రోజా.. అదంతా ఏమీ లేదని.. సంపాదన అంతా అనసూయదే అని నిర్మోహమాటంగా కామెంట్ చేస్తుంది. అంతేకాదు అనసూయ కేవలం ప్రోమో కోసమే ఇలా చెబుతోందని అసలు విషయం చెప్పింది. దీంతో అనసూయ ఫ్యామిలీలో సంపాదన అంతా ఆమెదే అంటూ రోజా పరోక్షంగా చెప్పినట్టయ్యింది. అయితే ఇదంతా ప్రోమోనే కావడంతో.. రోజా కామెంట్స్‌కు అనసూయ రియాక్షన్ ఏమిటో తెలియాలంటే ఈ వారం జబర్థస్త్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Anasuya Bharadwaj, Roja Selvamani

  ఉత్తమ కథలు