బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో జబర్దస్త్ నటీనటులు..

ప్రస్తుతం బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం జబర్దస్త్ నటీనటులను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

news18-telugu
Updated: December 2, 2019, 7:31 AM IST
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో జబర్దస్త్ నటీనటులు..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)
  • Share this:
ప్రస్తుతం బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో రోజాను అనుకుంటున్నారు. ఇప్పటికే  రోజా ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా నిన్న మొన్నటి వరకు హల్ చల్ చేసిన అనసూయ భరద్వాజ్‌ను ఈ సినిమాలో ముఖ్యపాత్రలో తీసుకోబోతున్నట్టు సమాచారం.

రోజాకు జబర్దస్త్ బర్త్‌డే విషెస్ చెప్పిన అనసూయ, jabardasth anchor anasuya birthday wishes to ysrcp mla roja selvamani
అనసూయ, రోజా


మరోవైపు ఈ సినిమాలో రెగ్యులర్ కమెడియన్స్‌ను కాాకుండా.. జబర్ధస్త్ షో లో పాపులర్ అయిన కమెడియన్స్‌ను ఈ సినిమాలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిచనున్నారు. ఈ సినిమాను ఈ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి...ఏప్రిల్ చివరి వారలంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ సినిమాను కూడా బాలకృష్ణ ఇమేజ్ తగ్గ పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ చేయని డిఫరెంట్ స్టోరీ అని చెబుతున్నారు. మొత్తానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం రెగ్యులర్ నటీనటులను కాకుండా కొత్త వాళ్లతో తెరకెక్కించాలనుకోవడం మంచి పరిణామనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 2, 2019, 7:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading