గెటప్ శ్రీను జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వ్యక్తి. జబర్దస్త్ షోతో పాపులారిటీ పెంచుకున్న శ్రీను అటు సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేస్తున్నారు. కానీ జబర్దస్త్ స్కిట్స్ చేయడం మాత్రం మానలేదు. తాజాగా గెటప్ శ్రీను సరికొత్త జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సరికొత్త స్కిట్ చేశారు. ఇందులో చిరంజీవి ఇంద్రసేనా రెడ్డి పాత్రలో గెటప్ శ్రీను కనిపిస్తే.. పవన్ కల్యాణ్ పాత్రలో సుడిగాలి సుధీర్ సందడి చేశాడు. ఇంద్ర గెటప్‌లో స్టేజ్‌పైకి వచ్చిన శ్రీనును అన్నయ్య అంటూ పిలిచారు నాగబాబు. ఆ తర్వాత గెటప్ శ్రీను గురించి పొగిడే క్రమంలో నాగబాబు, చిరంజీవి గెటప్‌లో ఉన్న శ్రీను మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. గెటప్ శ్రీనును పొగడుతుంటే.. నాగబాబు వాడు పెద్ద వేస్ట్ ఫెలో అంటూ.. నాగబాబు కామెంట్స్ చేయడం అక్కడున్న వారందరితో పాటు.. బుల్లి తెర ప్రేక్షకుల్ని సైతం కడుపబ్బా నవ్వించింది. ఇప్పడీ జబర్దస్త్ ప్రోమో వైరల్‌గా మారింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.