రష్మీ గౌతమ్‌ను వాడుకుంటున్న సుడిగాలి సుధీర్.. దానికోసమే..

అభిమానులు, ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్ఫాన్స్‌ను క్యాచ్ చేసుకుంటూ మరింత రక్తి కట్టించేలా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ రొమాన్స్ పండిస్తూ ఉంటారు. దానికి నిర్వాహకులు మరింత ఎక్కువ మసాలా యాడ్ చేస్తారు.

news18-telugu
Updated: November 3, 2019, 6:02 PM IST
రష్మీ గౌతమ్‌ను వాడుకుంటున్న సుడిగాలి సుధీర్.. దానికోసమే..
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్
  • Share this:
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. వీళ్లిద్దరు బుల్లితెర హీరో హీరోయిన్లు. బుల్లి తెరపై వీరిద్దరికి ఉన్న క్రేజ్ ఏ స్టార్ హీరోకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ జంట తెరపై కనిపిస్తే చాలు కొంత మంది అభిమానులు ఖుషీ అవుతారు.. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు.. ఎప్పుడు ఆ శుభవార్త చెబుతారా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ షో కు యాంకర్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరు ఆ కార్యక్రమానికి ఎక్స్‌ట్రా అసెట్ అయ్యారు. స్క్రీన్‌పై వీళ్లు చూపించే రొమాన్స్, హావభావాలు షో కే హైలైట్. రష్మీ, సుధీర్‌పై సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. యూట్యూబ్‌లో అయితే ఏకంగా వీళ్ల మధ్య ఏదేదో జరుగుతుందంటూ వార్తలు వండి వారుస్తారు. అయితే.. తమ ఇద్దరి మధ్య ఏం లేదని.. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వాళ్లం హ్యాపీగా ఉన్నామని ఈ జంట ఎప్పుడో స్పష్టం చేసింది. అయినా ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. దీనికి ప్రధాన కారణం కూడా వాళ్లే. అభిమానులు, ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్ఫాన్స్‌ను క్యాచ్ చేసుకుంటూ మరింత రక్తి కట్టించేలా రొమాన్స్ పండిస్తూ ఉంటారు. దానికి నిర్వాహకులు మరింత ఎక్కువ మసాలా యాడ్ చేస్తారు.

ఇకపోతే.. రష్మీని సుడిగాలి సుధీర్ వాడుకుంటున్నాడని జబర్దస్త్ జడ్జి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్మీ తప్పేం లేదని, ఆమె మంచి అమ్మాయి అని.. కేవలం పబ్లిసిటీ కోసం సుధీర్ ఇలా చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే.. ఈ శుక్రవారం ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో లో సుధీర్ పవన్ కల్యాణ్‌లా, గెటప్ శీను చిరంజీవిలా వేషం వేశారు. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ గెటప్‌లో ఉన్న సుధీర్ తనను తాను హైప్ చేసుకునే ప్రయత్నం చేశాడు. రష్మీతో తనకు మంచి బంధం ఉందని.. యూట్యూబ్‌లో కూడా వార్తలు వస్తున్నాయని అన్నాడు. వెంటనే కలగజేసుకున్న నాగబాబు.. అదంతా తప్పు అని, రష్మీని అనవసరంగా లాగుతున్నారని చెప్పాడు.

రష్మీతో బంధం అంటూ సుధీర్ చేసేదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని నాగబాబు స్పష్టం చేశాడు. సుధీర్ పెద్ద ఎదవ అని, బేవార్స్ అని తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఇదంతా స్కిట్‌లో భాగం కావడంతో స్కిట్ నడుస్తున్నంత సేపు ప్రేక్షకులు కడుపునిండా నవ్వుకున్నారు.
First published: November 3, 2019, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading