పవన్‌ కల్యాణ్‌ను జార్జి రెడ్డితో పోల్చిన నాగ బాబు

జార్జి రెడ్డి బయోపిక్‌ను పవన్ కళ్యాణ్ లేదా ఇప్పటి హీరోల్లో వరుణ్ తేజ్‌తో తీస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నానని చెప్పారు నాగబాబు. జార్జి రెడ్డి ఫొటోలు చూసినప్పుడల్లా పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని చెప్పారు.

news18-telugu
Updated: November 13, 2019, 2:15 PM IST
పవన్‌ కల్యాణ్‌ను జార్జి రెడ్డితో పోల్చిన నాగ బాబు
జార్జి రెడ్డి పాత్రలో పవన్ కల్యాణ్... నాగబాబు మనసులో మాట
  • Share this:
పవన్‌ కల్యాణ్‌ను జార్జి రెడ్డితో పోల్చిన నాగ బాబుజార్జి రెడ్డి మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగాయి. నవంబరు 22న విడుదల కానున్న జార్జిరెడ్డి మూవీపై నాగబాబు ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చాలా బాగుందని.. 'బయోపిక్ అంటే ఇదీ' అంటూ మెచ్చుకున్నారు. జార్జి రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేకమైన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేసిన ఆయన.. త్వరలోనే జార్జి రెడ్డి మూవీ యూనిట్ సభ్యులను కలుస్తానని చెప్పారు. అంతేకాదు జార్జి రెడ్డి బయోపిక్‌ను పవన్ కళ్యాణ్ లేదా ఇప్పటి హీరోల్లో వరుణ్ తేజ్‌తో తీస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నానని చెప్పారు నాగబాబు. ఐతే ఈలోగా జీవన్ రెడ్డి ఆ సినిమాను తీశారని తెలిసి సంతోషించానని వెల్లడించారు. జార్జి రెడ్డి ఫొటోలు చూసినప్పుడల్లా పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని చెప్పారు.

జార్జి రెడ్డి గురించి చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నా. ఆ పాత్రలో పవన్ లేదా వరుణ్ నటిస్తే బాగుంటుందని అనుకున్నా. కానీ జీవన్ రెడ్డి తీశాడని తెలిసింది. ట్రైలర్ చూశాక.. ఆ పాత్రకు పేరున్న నటుడు అయితే అంతగా సరిపోడని అనిపించింది. ఇప్పటి వరకు చిన్నపాత్రలే చేసిన సందీప్ మాధవ్.. జార్జి రెడ్డి పాత్రకు చక్కగా సరిపోయాడు. జార్జి రెడ్డి గొప్ప వ్యక్తి. ఆయన బతికిఉంటే ఏదో ఒక రాష్ట్రానికి సీఎం అయ్యేవారు. జార్జి రెడ్డి ఫొటోలు చూసినప్పుడల్లా పవనే గుర్తుకొస్తాడు. ఆయన వ్యక్తిత్వం, ఎమోషన్స్ పవన్‌లో కనిపిస్తాయి. అందుకే మా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం.
నాగ బాబు
జార్జిరెడ్డి మూవీలో సందీప్ మాధవ్, సత్యదేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంది స్పందన వస్తోంది. జార్జి రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ జీవించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా నవంబరు 22న విడుదల కానుంది. ఇక నవంబరు 17న ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం.

నాగబాబు వీడియో ఇక్కడ చూడండి:

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...