పైకి కనిపించడు కానీ నాగబాబు లోపల చాలా కామెడీ ఉంటుంది. మనిషి పైకి చూడ్డానికి సీరియస్‌గా కనిపించినా కూడా అతడి నవ్వుకు చాలా మంది అభిమానులున్నారు. అందుకే జబర్దస్త్ కార్యక్రమం అంత పెద్ద విజయం సాధించింది. ఇక ఈయన వేసే పంచ్ డైలాగులకు కూడా తిరుగుండదు. స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు వేసే పంచులకు పగలబడి నవ్వుతారు ఆడియన్స్. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి జోకులేసాడు మెగా బ్రదర్. తాజాగా ఈటీవీలో దివాళి సందర్భంగా ఉత్తమ పురుషులు ఈవెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 3.15 నిమిషాలున్న ఈ ప్రోమోలో అదిరిపోయే పంచ్ డైలాగులున్నాయి.
ముఖ్యంగా నాగబాబు తన అప్పియరెన్స్‌తో కుమ్మేసాడు. సన్నగా.. సూపర్ గ్లామర్‌గా మారిపోయాడు మెగా బ్రదర్. ఈ కార్యక్రమానికి సుమ కనకాలతో పాటు సుడిగాలి సుధీర్, చంద్ర, చంటి హోస్టులుగా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు.. సుమ కానకాల వయసుపై అదిరిపోయే పంచ్ వేసాడు. తెలుగు యాంకర్లలో సీనియర్ అయిన సుమ వయసుపై ఇప్పటికే చాలా ట్రోల్స్ నడుస్తుంటాయి. ఈమె కూడా తన ఏజ్‌పై వస్తున్న ట్రోల్స్ చాలా కామెడీగా తీసుకుంటుంది. ఇప్పుడు నాగబాబు కూడా ఇలాంటి పంచ్ డైలాగ్ ఒకటి వేసాడు.
ఇంత సన్నగా ఎలా అయిపోయారు సర్ అంటూ సుడిగాలి సుధీర్.. నాగబాబును అడుగుతాడు. దానికి బదులిస్తూ అరే సుధీర్.. మన సుమ ఏం చెప్పిందిరా.. రోజులో 4 గంటలు తిని.. 20 గంటలు కష్టపడమని చెప్పారు.. అంటాడు నాగబాబు. దానికి వెంటనే పెద్దోళ్లు కదా సర్ చెప్పింది అంటే.. ఇక్కడ నీకంటే పెద్దోళ్లు ఎవరున్నారు సుమ అంటూ పంచ్ వేసాడు నాగబాబు. మెగా బ్రదర్ వేసిన పంచ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కూడా. ప్రోమోతోనే దివాళీ ఈవెంట్‌పై అంచనాలు పెంచేసారు. మొత్తానికి ఇలాంటి పంచులు ప్రోగ్రామ్‌లో ఇంకా బోలెడుండటం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.