ఎమ్మెల్యే రోజా అనూహ్య నిర్ణయం.. ఇకపై వాటికి నో అంటున్న జబర్ధస్త్ జడ్జ్..

YSRCP MLA Roja | జబర్ధస్త్ కామెడీ షో జడ్జ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా.. తాజాగా ఓ అనూహ్యమైన  నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 13, 2020, 7:04 AM IST
ఎమ్మెల్యే రోజా అనూహ్య నిర్ణయం.. ఇకపై వాటికి నో అంటున్న జబర్ధస్త్ జడ్జ్..
జబర్దస్త్ షోలో MLA రోజా Photo : Youtube
  • Share this:
రోజా.. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు టీవీ షోలతో అన్ని చోట్ల తనకంటూ ప్రత్యేకమైన గుర్తిం.పు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందో.. తాను చేసే ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీకి తగినంత సమయాన్ని కేటాయిస్తూ.. అన్నింటినీ బాగానే బ్యాలెన్స్ చేస్తోంది రోజా. స్మాల్ స్క్రీన్ పై రఫ్పాడిస్తోన్న రోజా.. గత కొన్నేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పైగా అంతగా ఫోకస్ పెట్టడం లేదు. అలా అని ఆమెకు అవకాశాలు రావడం లేదా అంటే అది లేదు. ఆమెను దృష్టిలో పెట్టుకొని పలువురు దర్శకులు కొన్ని క్యారెక్టర్స్ సృష్టించినా.. రోజా మాత్రం ఎందుకో సినిమాలపై అంతగా దృష్టి సారించడం లేదు. ఐనా.. కొందరు సినీ దర్శక,నిర్మాతలు ఆమెను మరోసారి వెండితెరపై చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను, రోజాను కలిసి బాలయ్య సినిమాలో యాక్ట్ చేయమని ఆఫర్ కూడా చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో రోజా పాత్ర కూడా బాలకృష్ణతో సరిసమానమైన పాత్ర కావడంతో ఆమె చేస్తే బాగుంటుందిని కూడా చెప్పాడు. కానీ రోజా మాత్రం.. ఏపీ అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ సినిమాలో నటించనని తెగేసి చెప్పేసింది. మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా చేయనని తెగేసి చెప్పేసింది. అంతేకాదు మరోసారి నాగబాబుతో జడ్జ్‌గా స్క్రీన్ షేర్ చేసుకోనని ఆమె సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.

బాలకృష్ణ, రోజా (Twitter/Photo)


రీసెంట్‌గా రోజాకు.. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆఫర్ వచ్చినా.. జబర్ధస్త్ జడ్జ్ మాత్రం ఓకే చెప్పలేదు. అంతేకాదు ‘లూసిఫర్’ రీమేక్‌ కోసం చిరంజీవి పలువురు హీరోయిన్స్‌ను అనుకున్నా.. ముందుగా సంప్రదించింది రోజానే. రోజా నో చెప్పడంతో చిరంజీవి.. ఇపుడు వేరే సీనియర్ హీరోయిన్స్ కోసం వెతుకుతున్నాడు. ఇప్పటికే సుహాసిని, ఖుష్బూ అనుకున్నా.. ఎవరు సెట్ కావడం లేదు.

Jabardasth judge mla roja takes decision not to act nandamuri and mega family heroes movies
చిరంజీవి, రోజా (File/Photos)


దీని వెనక పెద్ద రీజనే ఉందని చెబుతున్నారు ఆమె సన్నిహితులు. రోజా మెగా, నందమూరి ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోల సినిమాల్లో యాక్ట్ చేయనని చెప్పడానికి పెద్ద రీజనే ఉంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. రోజాను జబర్ధస్త్ వంటి కామెడీ షోలో జడ్జ్‌గా వ్యవహించినా పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ సినిమాల్లో యాక్ట్ చేసిన వైసీపీ వైరీ పక్షం టీడీపికి చెందిన బాలకృష్ణతో పాటు జనసేన పార్టీకి చెందిన చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్‌తో యాక్ట్ చేయకూడదని షరుతులు పెట్టినట్టు సమాచారం. ఈ విషయం తెలిసే.. నాగబాబు.. జబర్ధస్త్ షో నుంచి మెల్లగా తప్పుకొని.. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’, ‘అదిరింది’ ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.

nagababu exit jabardasth comedy show due mla roja politics here are the details,nagababu,roja,mla roja,roja nagabau,nagababu exit due to roja politics,jabardasth,jabardasth comedy show,pinky jabardasth,sai teja out of jabardasth,nagababu pinky,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా,రోజా,నాగబాబు,రోజా పాలిటిక్స్,రోజా పాలిటిక్స్‌తో నాగబాబు బలి
నాగబాబు, రోజా Photo : Twitter


మరోవైపు రోజాకు బాలకృష్ణ సినిమాలో చేయాలని ఉన్న పొలిటికల్ ఈక్వెషన్స్ కారణంగా నో చెప్పినట్టు సమాచారం. మరోవైపు రోజా.. అప్పట్లో బాలయ్యతో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసింది.  ఆ పరిచయంతో ఆమె టీడీపీలో జాయిన్ అయి... రాజకీయంగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత టీడీపీ వీడి వైసీపీ పంచన చేరింది. ఐతే.. అసెంబ్లీ సాక్షిగా బాలయ్యతో సినిమా చేయనని చెప్పినా.. అసెంబ్లీ లాబీలో బాలయ్యతో ఆమె సెల్ఫీ తీసుకోవడం పెద్ద సంచలనమే అయింది.  మొత్తానికి సినిమాల విషయంలో రోజా.. నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలకు తన తలుపులను శాశ్వతంగా మూసేందనే చెప్పాలి. 
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading