హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth Roja: MLA రోజాకు ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్క సినిమా కూడా వదలదంట..

Jabardasth Roja: MLA రోజాకు ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్క సినిమా కూడా వదలదంట..

జబర్దస్త్ కామెడీ షోలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం వచ్చిన వాళ్లు వచ్చే వారం వస్తారో లేదో గ్యారెంటీ లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు రోజా కూడా ఈ షో నుంచి బయటికి వచ్చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ కామెడీ షోలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం వచ్చిన వాళ్లు వచ్చే వారం వస్తారో లేదో గ్యారెంటీ లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు రోజా కూడా ఈ షో నుంచి బయటికి వచ్చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Jabardasth Roja: జబర్దస్త్ జడ్జిగా.. ఎమ్మెల్యేగా తన బాధ్యతలతో బిజీగా ఉంది రోజా. అక్కడా ఇక్కడా సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది. మధ్యలో ఈవెంట్స్ కూడా చేస్తుంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తుంది ఈమె. ఓ వైపు పొలిటికల్‌గా అంత..

ఇంకా చదవండి ...

జబర్దస్త్ జడ్జిగా.. ఎమ్మెల్యేగా తన బాధ్యతలతో బిజీగా ఉంది రోజా. అక్కడా ఇక్కడా సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది. మధ్యలో ఈవెంట్స్ కూడా చేస్తుంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తుంది ఈమె. ఓ వైపు పొలిటికల్‌గా అంత బిజీగా ఉన్నా కూడా ప్రొఫెషనల్‌గానూ న్యాయం చేస్తుంది. డేట్స్ ఎక్కడా క్లాష్ కాకుండా చూసుకుంటుంది. రోజా కమిట్ అయింది అంటే కచ్చితంగా పూర్తి చేస్తుందనే నమ్మకం దర్శక నిర్మాతలలో కలిగించింది. అలాంటి రోజా అంటే చాలా మందికి అభిమానం. అంతేకాదు 100 సినిమాలకు పైగా నటించిన ఈమెకు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. అలాంటి రోజాకు యిష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. రోజాకు యిష్టమైన హీరో అంటే ఆమె నటించిన వాళ్ల పేర్లు చెప్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఎవరూ ఊహించని సమాధానం చెప్పింది రోజా. ఒక్క సినిమాలో కూడా ఆయనతో కలిసి నటించకుండానే ఆయనంటే పిచ్చి అని చెప్తుంది. రోజా మనసు అంతగా దోచేసిన ఆ హీరో ఎవరో తెలుసా..? మాస్ మహరాజా రవితేజ. అవును.. నమ్మడానికి చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. రవితేజ అంటే తనకు చాలా యిష్టమంటుంది ఈమె. మాస్ రాజా నటనకు తాను ఫిదా అయిపోతానని చెప్పింది. రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తుంటానని.. ప్రతీ సినిమాను ఎంజాయ్ చేస్తానంటుంది. ముఖ్యంగా రవితేజలోని కామెడీ యాంగిల్ తనకు చాలా బాగా నచ్చుతుందని.. ఆయన కామెడీ చేస్తుంటే తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పింది రోజా. చిన్నపుడు తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎక్కువగా అభిమానం అని.. కానీ ఇప్పుడు మాత్రం రవితేజకు ఆ అభిమానం షిఫ్ట్ అయిపోయింది అంటుంది ఈ ఎమ్మెల్యే. రోజా మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా రవితేజ అంటే చాలా యిష్టం.

jabardasth roja,jabardasth roja mla,jabardasth roja ravi teja,jabardasth roja favorite hero ravi teja,ravi teja twitter,mla roja twitter,ravi teja krack movie,ram charan ravi teja krack,telugu cinema,రవితేజ,రోజా ఫేవరేట్ హీరో రవితేజ,రామ్ చరణ్ రవితేజ,క్రాక్ రవితేజ కలెక్షన్స్
రోజా రవితేజ (Roja Ravi Teja)

ఈ మధ్యే ఇదే విషయం చెప్పాడు రామ్ చరణ్. తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా రవితేజను ఆరాధిస్తుంటారు. చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా.. మాస్‌లో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రవితేజ మాత్రమే. అందుకే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కూడా. అన్నట్లు రోజా, రవితేజ కలిసి గతంలో శంభో శివ శంభో, వీర, తిరుమల తిరుపతి వెంకటేష సినిమాలలో నటించారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: MLA Roja, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు