ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. నిజంగానే రోజాను చూస్తుంటే ఇదే అంటున్నారు కూడా అభిమానులు. ఇంత బిజీలో.. అమరావతి అంత వేడిలో కూడా చాలా కూల్‌గా తన పని తాను చేసుకుంటుంది రోజా. మరీ ముఖ్యంగా జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజా అన్నీ తానేయై చూసుకుంటుంది. ఆమెలో ఆ మునపటి జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ జోష్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే కొన్ని రోజులుగా జబర్దస్త్ ఎపిసోడ్లో కానీ.. మిగిలిన స్పెషల్ ఈవెంట్స్‌లో కానీ ఎంట్రీకి డాన్సులు చేయడం మానేసింది రోజా.
రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత.. బాధ్యతలు పెరిగిపోయిన తర్వాత హూందాగానే కనిపిస్తుంది నగిరి ఎమ్మెల్యే. దానికి తోడు ఓ వైపు ఈవెంట్స్ చేసుకుంటూనే.. మరోవైపు ప్రజాసేవలో కూడా నిమగ్నమైపోయింది రోజా. రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది ఈమె. అయితే ఎమ్మెల్యే కావడం.. దాంతోపాటు ఏపిఐఐసి ఛైర్ పర్సన్ కూడా కావడంతో కొన్నాళ్లుగా డాన్సులు చేయడం మానేసింది రోజా. కేవలం వచ్చి సీట్లో కూర్చుని.. ఒళ్ళు కదలకుండా కేవలం చేతులతో మాత్రమే స్టెప్పులు వేస్తుంది రోజా.
నాగబాబు కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలో ఇదే చేస్తున్నాడు. ఆయన ఉన్నపుడే రెండోసారి గెలిచిన తర్వాత రోజా కూడా ఇదే కంటిన్యూ చేస్తుంది. అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రోజా పాత రోజుల్లోకి వెళ్లిపోయింది. ఎందుకో తెలియదు కొన్ని ఎపిసోడ్స్ నుంచి రోజా బాగానే డాన్సులు చేస్తుంది. తాజాగా ఉగాది ఈవెంట్లో కూడా మాస్ డాన్సులతో కుమ్మేసింది. శేఖర్ మాస్టర్‌తో సామజవరగమనాతో పాటు మైండ్ బ్లాక్ పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది రోజా.
ఇదిలా ఉంటే రోజా టైమ్ మేనేజ్మెంట్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్యే ఓ స్కిట్లో ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది రోజా. పని చేతకాని వాళ్లు మీడియాను మేనేజ్ చేస్తే.. తాను టైమ్ మేనేజ్ చేస్తానని చెప్పింది. ఆ మధ్య ఈటీవీలో న్యూ ఇయర్ ఈవెంట్ ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే.. మొన్న సంక్రాంతికి అమ్మా నాన్న ఓ సంక్రాంతి ఇలా ఎందులో చూసినా కూడా రోజానే కనిపిస్తుంది. ఇప్పుడు ఉగాది ఈవెంట్లోనూ సత్తా చూపిస్తుంది. జబర్దస్త్ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తానికి ఎక్కడా చూసినా కూడా ఇప్పుడు రోజానే కనబడుతుంది. ఈమె టైమ్ మేనేజ్మెంట్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood