హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా..

మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా..

మహేష్ బాబుకు ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)

మహేష్ బాబుకు ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)

ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక సినీ నటి కమ్ ఎమ్మెల్యే రోజా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియజేసింది.

  ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఈయన బర్త్ డే‌ను ట్రెండ్ చేసారు. మరోవైపు పండగాడి బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇప్పటికే మహేష్ బాబుకు చిరంజీవి, అల్లరి నరేష్, అడివి శేష్ సహా పలువురు హీరోలతో పాటు మహేష్ బాబుతో సినిమాలు నిర్మించిన నిర్మాతలతో పాటు దర్శకులు మిగతా టెక్నిషియన్స్‌ బర్త్ డే విషెస్ తెలియజేసారు. తాజాగా నటి రోజా మహేష్ బాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

  ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణగారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కోట్లాది అభిమాన గుండెలు ఆదరించే హీరోగా, రోల్ మోడల్‌గా నిలిచిన టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్‌బాబుక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి పుట్టినరోజు మహేష్ మరిన్ని జరుపుకోవాలని కోరింది. ఇక రోజా విషయానికొస్తే.. ఈమె సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. ఎన్నో ఇంటర్వ్యూల్లో రోజా ఈ విషయాన్ని ప్రస్తవించారు. ఈమె సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘తెలుగు వీర లేవరా’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాతో పాటు ‘ఎన్‌కౌంటర్’ సినిమాలో కృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో రోజా.. కృష్ణకు కథానాయికగా నటించలేదు. మొత్తంగా రోజా.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియజేయడం చూసి మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, MLA Roja, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు