jabardasth: బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ప్రసారమవుతున్నాయి. ఇక కొన్ని డాన్స్ ప్రోగ్రాం లు కూడా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక కామెడీ షో గా వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం గురించి, అందులో వచ్చే కామెడీ పంచ్ ల గురించి ఆ షో చూసిన వారికి తెలుస్తుంది. ఇక జబర్దస్త్ ప్రోగ్రాంలో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ఇదిలా ఉంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇంద్రజ తెగ షాక్ అవుతుంది.
గతంలో జబర్దస్త్ డబుల్ మీనింగ్ డైలాగులతో కొన్ని సమస్యలు ఎదుర్కొంది. ఎంతో మంది కమెడియన్ల పై కూడా ప్రేక్షకులు మండిపడ్డారు. అంతేకాకుండా హద్దులు దాటి మరి ఎన్నో కౌంటర్లు వేశారు. ఇలా ఒక్క టీమే కాకుండా అన్ని టీమ్ లు కూడా అలాగే డబుల్ మీనింగ్ మాటలతో కౌంటర్లు వేసేవారు. ఇక జడ్జిగా ఆ మధ్య నాగబాబు, రోజా ఉండగా వీళ్లు కూడా తెగ కౌంటర్లు వేసే వాళ్ళు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి స్థానం లో మరో ఇద్దరు కొత్త జడ్జి లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
నాగబాబు ఈ షో వదిలి వెళ్ళిన తర్వాత ఆయన స్థానంలో మనో చేరారు. ఇక రోజా అనారోగ్య సమస్యతో ఇంట్లో ఉండడం వల్ల తన స్థానంలో నటి ఇంద్రజ చేరారు. ఇక ఇందులో చేసే కామెడీలు, పంచ్ లు, డబల్ మీనింగ్ డైలాగులకు మనో కూడా జాయిన్ అవుతున్నాడు. ఇక తాజాగా కాస్త శృతి మించిన డైలాగ్ విన్న ఇంద్రజ బాగా షాక్ అయింది.
వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో అందరూ కామెడీయన్ తమ టీం లతో పంచ్ డైలాగులతో ప్రారంభించారు. ఇక వెంకీ మంకీ టీం లో లేడీ గెటప్ హరిత తెగ డైలాగులు కొడుతూ ఉంటుంది. ఇక తాగుబోతు రమేష్ తో హరిత స్కిట్ లో పాల్గొనగా.. ఇంటికి టార్చ్ లైట్ ఇల్లాలు అంటూ హరిత డైలాగ్ కొడుతుంది. వెంటనే టార్చ్ కాదని దీపం అని రమేష్ అనగా.. చీకట్లో ఏదైతే ఏంటి అంటూ పంచ్ వేస్తుంది. ఇక ఈ ఘాట్ రోడ్డులో తన ఫ్రెండ్ బండి చెడిపోయిందంటూ.. ఈ రాత్రి ఎక్కడ ఉండాలి అని తాగుబోతు రమేష్ అనగా.. ఆ పక్కన ఓ పెద్ద బండ ఉంటుంది. అక్కడే ఓ చాప దిండు ఉంటుంది పడుకొని రేపు పొద్దున రమ్మని అని హరిత అంటుంది. దీంతో పవన్ ఎక్కడ ఉంటాను నీకు ఎలా తెలుసు అని ఆమెను ప్రశ్నించగా.. వెంటనే మనో అది పర్మినెంట్ ప్లేస్ అని కౌంటర్ వేస్తాడు. ఇక ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ తో ఇంద్రజ బాగా షాక్ అవుతుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.