Actress Indraja: తెలుగు సినీ నటి ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంటూ సహాయ పాత్రలలో బాగా మెప్పిస్తుంది. ఇక ఈ మధ్య తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది. అది కూడా బుల్లితెరలో పలు షో లలో అడుగు పెట్టింది. జబర్దస్త్ కామెడీ షోతో జడ్జిగా పరిచయమైన ఇంద్రజ.. బుల్లితెరపై అతి తక్కువ సమయంలో ప్రేక్షకులను మెప్పించింది. తన అందంతో, తన మాటలతో అందర్నీ బాగా ఆకట్టుకుంది. జబర్దస్త్ లో జడ్జిగా చేస్తూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ షోను చూసేలా చేసుకుంది. ఇక కమెడియన్స్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతూ తను కూడా పంచ్ లు వేయడం మొదలు పెట్టింది. ఇక మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా పాల్గొని తన డాన్సులతో, నవ్వులతో బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బాగా ఎమోషనల్ అయ్యింది ఇంద్రజ.
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఓంకార్ హోస్టింగ్ చేస్తూ.. వచ్చిన సెలబ్రిటీలను టెన్షన్ లో ముంచుతాడు. దీంతో ఈ వారం ఎపిసోడ్ లో ఇంద్రజ పాల్గొన్నది. తనతో పాటు సుడిగాలి సుధీర్ కూడా పాల్గొని బాగా రచ్చ చేశాడు. ఇక ఇంద్రజతో డాన్స్ చేస్తూ బాగా సందడి చేశాడు సుధీర్.
కొన్ని గేమ్స్ ఆడుతూ బాగా ఆకట్టుకున్నారు. ఇక ఓంకార్ ఇంద్రజ అందాన్నీ తెగ పొగిడాడు. సుధీర్ మాత్రం తన మాటలతో ఇంద్రజను ఇక్కడ కూడా నవ్వించాడు. ఇదిలా ఉంటే ఇంద్రజ కాస్త ఎమోషనలైంది. తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మాట్లాడింది. తన తండ్రి అంటే ఇష్టమని చిన్నప్పటి నుంచి అన్నీ ఆయనే అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది.
ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి వంట చేసేవారని.. అమ్మతో పాటు తమ అందర్నీ కూడా బాగా చూసుకునేవారని తెలిపింది. అలా తమకు అమ్మయినా, నాన్న అయినా అన్నీ ఆయనే అని.. తండ్రి ప్రేమను అంతగా ఎవరు గుర్తించరని తెలిపింది. తండ్రి అనే వారు లేకుంటే కుటుంబం ఉండదని చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor omkar, Indraja, Jabardasth, Sixth sense season 4, Star Maa, Sudigali sudheer