బాలయ్య, బోయపాటి సినిమాలో పవర్‌పుల్ విలన్‌గా రోజా..

ప్రస్తుతం  సినీ నటి రోజా.. ఒకవైపు రాజకీయాలు..మరోవైపు జబర్ధస్త్ షోతో తీరిక లేకుండా గడిపింది. తాజాగా రోజా.. బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 18, 2019, 6:53 PM IST
బాలయ్య, బోయపాటి సినిమాలో పవర్‌పుల్ విలన్‌గా రోజా..
బాలకృష్ణ,రోజా,బోయపాటి శ్రీను (File Photos)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 18, 2019, 6:53 PM IST
ప్రస్తుతం  సినీ నటి రోజా.. ఒకవైపు రాజకీయాలు..మరోవైపు జబర్ధస్త్ షోతో తీరిక లేకుండా గడిపింది. అంతేకాదు వైసీపీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయింది. దీంతో రోజాకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రి పదవి ఖాయం అనే మాట వినబడింది. కానీ సామాజిక సమీకణాల నేపథ్యంలో రోజాకు క్యాబినేట్‌లో స్థానం దక్కలేదు. దీంతో రోజాకు జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ హోదా గల  ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కినప్పటికీ రోజా ..జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా దాదపు రూ. 3.82 లక్షల జీత భత్యాలు అందుకుంటున్నారు.  క్యాబినేట్ హోదాగల పదవిలో ఉండటంతో రోజా ఇది వరకటిలా  కాకుండా.. జబర్ధస్త్‌ షోలో హుందాగా వ్యవహరిస్తున్నారు.

YCP MLA Roja beats Nandamuri balakrishna and becomes APIIC Chairman after electing second time pk.. బాల‌య్య‌, రోజా.. సినిమాల్లో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వీళ్లు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా రాజ‌కీయాల్లో మాత్రం రెండూ భిన్న‌ధృవాలు. ఎవ‌రి దారి వాళ్ల‌దే. Balakrishna nandamuri,mla roja,ycp mla roja,roja balayya,mla roja APIIC chairman,roja take oath as mla's in Andhra pradesh Assembly,nandamuri balakrishna,rk roja,mla balakrishna,balakrishna facebook,Balakrishna,balakrishna roja,roja,balakrishna take oath as mla,roja take oath as mla,balakrishna tdp mla,roja ysrcp mla,andhra pradesh news,andhra pradesh politics,chandrababu naidu,ys jagan mohan reddy,ysrcp ys jagan mohan reddy,andhra pradesh assembly elections,ap assembly mla's oath,tollywood,telugu cinema,nbk,balayya,balakrishna twitter,balakrishna instagram,roja instagram,roja twitter,roja facebook,jabardasth judge roja,jabardasth comedy show,రోజా,బాలయ్య,బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా,నగరి రోజా,హిందూపురం బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ
పెద్దన్నయ్య సినిమాలో బాలయ్య,రోజా


తాజాగా రోజా మరోసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమలో రోజా..పవుర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్ర కాబట్టి రోజాను సంప్రదించినట్టు సమాచారం. రోజా కూడా ఈ తనకు వైరీ పక్షం పార్టీ లీడరైన బాలయ్య సినిమాలో ఈ పాత్ర చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరు కలిసి ఏడు సినిమాల్లో జోడిగా నటించారు. ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన ‘పరమ వీరచక్ర’, శ్రీరామరాజ్యం’ సినిమాల్లో రోజా గెస్ట్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.  ఈ సినిమాలో ఈ  క్యారెక్టర్ రోజా చేస్తేనే బాగుంటుందని బాలయ్య, బోయపాటి శ్రీనులు భావిస్తున్నారు. మరి రోజా ఈ పవర్‌ఫుల్ విలన్ రోల్ చేయడానికి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...