హోమ్ /వార్తలు /సినిమా /

రోజా వద్దంది.. విజయ శాంతి ఔనంటుందా..

రోజా వద్దంది.. విజయ శాంతి ఔనంటుందా..

రోజా, విజయశాంతి (File/Photos)

రోజా, విజయశాంతి (File/Photos)

రోజా వద్దంది.. విజయ శాంతి ఔనంటుందా... ఇక వీళ్లిద్దరి విషయానికొస్తే.. వీళ్లిద్దరు హీరోయిన్స్‌గా తమ కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు.

రోజా వద్దంది.. విజయ శాంతి ఔనంటుందా... ఇక వీళ్లిద్దరి విషయానికొస్తే.. వీళ్లిద్దరు హీరోయిన్స్‌గా తమ కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ముందుగా విజయ శాంతి.. బీజేపీ, తల్లి తెలంగాణ, టీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఒకసారి టీఆర్ఎస్ తరుపున మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక రోజా విషయానికొస్తే.. తెలుగు దేశం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా.. ఆ తర్వాత వైయస్ఆర్‌సీపీతో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆ పార్టీ తరుపున వరుసగా రెండు సార్లు ఏపీ అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తాజాగా రోజా.. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు జబర్దస్త్ షో వంటి టీవీ ప్రోగ్రామ్స్ తో తీరికా లేకుండా గడుపుతుంది. ఇక విజయ శాంతి మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉంది. తాజాగా అనిల్ రావిపూడి దర్శత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో యాక్ట్ చేసింది. దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత విజయ శాంతి వెండితెరపై కనిపించనుంది.

jabardasth judge cum mla roja rejected balakrishna boyapati srinu movie will vijayashanti accept this charecter,roja,vijayashanti,roja vijayashanti,balakrishna nandamuri,boyapati srinu,balayya,nbk,balakrishna roja vijayashanti,balakrishna roja,balakrishna vijayashanti,roja jabardasth comedy show,roja twitter,roja facebook,roja instagram,vijayashanti facebook,vijaya shanti twitter,vijayashanti instagram,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,tollywood,telugu cinema,బాలకృష్ణ,రోజా,విజయశాంతి,బాలకృష్ణ విజయశాంతి రోజా,విజయశాంతి రోజా,బాలకృష్ణ రోజా,బాలకృష్ణ విజయశాంతి,బాలకృష్ణ బోయపాటి శ్రీను విజయశాంతి,
విజయశాంతి,బాలకృష్ణ (File/Photos)

రీసెంట్‌గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో పవర్‌ఫుల్ పాత్రకు రోజాను అనుకున్నారు. కానీ రోజా మాత్రం బాలయ్యతో సినిమా చేయనంటే చేయనని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను.. అనిల్ రావిపూడితో కలిసి విజయశాంతిని సంప్రదించారట. అంతేకాదు బోయపాటి శ్రీను విజయశాంతికి ఈ సినిమాలో ఆమె పాత్ర విడమరిచి చెప్పారట. దీనిపై విజయశాంతి బోయపాటి శ్రీనుకు ఔనని చెప్పలేదు. కాదని చెప్పలేదట. మొత్తానికి రోజా వద్దన్న పాత్రను విజయశాంతి ఔనంటుందా. విజయశాంతి విషయానికొస్తే.. బాలకృష్ణతో గతంలో అనేక చిత్రాల్లో జోడిగా నటించింది. వెండితెరపై వీళ్లిద్దరిది హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి బాలయ్య చిత్రానికి విజయశాంతి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు