JABARDASTH JUDGE CUM MLA CUM APIIC CHAIMAN ROJA DISPOINTED AP CM YS JAGAN MOHAN NOMINATED LAKSHMI PARVATHI AS AP TELUGU ACADEMY CHAIR PERSON TA
వైయస్ జగన్ పై రోజా అసంతృప్తి.. కారణం ఆమెనా..
ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీసమ్మె విషయమై ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా ఎపుడైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచి రోజా, జగన్ మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్టు సమాచారం. తాజాగా రోజా.. జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీసమ్మె విషయమై ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా ఎపుడైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచి రోజా, జగన్ మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్టు సమాచారం. తనకు తెలియకుండా..రోజా తెలంగాణ సీఎంపై మాట్లాడటంపై జగన్.. రోజాకు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం. ఆ తర్వాత రోజా కూడా తెలంగాణకు సంబంధించిన ఇష్యూపై మాట్లాడం మానేసింది. రోజా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఏపీ క్యాబినేట్లో చోటు కన్ఫామ్ అని అందరు అనుకున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు రీత్యా ..రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు జగన్. దీంతో ఆమెకు మంత్రి పదవితో సమానమైన ‘ఏపీఐఐసీ’ చైర్ పర్సన్‌గా నియమించాడు. ఈ పదవిపై రోజా అసంతృప్తిగానే ఉంది. తాజాగా రోజా.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి..లక్ష్మీ పార్వతి ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమించడంపై కాస్తంత అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
సీఎం జగన్, లక్ష్మీపార్వతి
తను ప్రతిపక్షంలో ఉన్నాళ్లు ఆస్తులు పోగుట్టుకొని..తెలుగు దేశం పార్టీ తనను ఎన్నో వేధింపులకు గురిచేసినా.. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. తీరా మంత్రి పదవి అందినట్టే అంది చేజారింది. మరోవైపు లక్ష్మీ పార్వతి మీడియా ముఖంగా తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేసినా.. రోజాల మాత్రం బస్తీమే సవాల్ అన్నట్టు వ్యవహరించలేదు. ఇక లక్ష్మీ పార్వతి ఏదో కొన్ని డిబేట్స్‌లో పాల్గొన్న వైసీపీ వాయిస్‌ను వినిపించినా.. అది ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. అలాంటి లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ భార్య అనే ట్యాగ్ తప్పించి మరేది లేదన్నది రోజా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. పార్టీ కోసం అంతగా కష్టపడని లక్ష్మీ పార్వతి లాంటి వాళ్లకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా.. తనతో సమానమైన పోస్ట్ ఇవ్వడంపై రోజా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.