MLA రోజా చేతిలో కత్తి.. ఎడాపెడా ఎగరేసి నరికేస్తుందిగా..

MLA Roja: ఎప్పుడూ రాజకీయాలు, షోలు అంటూ బిజీ బిజీగా గడిపే రోజాకు ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా ఖాళీ టైమ్ దొరికింది. దాంతో పూర్తిగా పిల్లలతోనే గడిపేస్తుంది ఈమె.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2020, 8:12 PM IST
MLA రోజా చేతిలో కత్తి.. ఎడాపెడా ఎగరేసి నరికేస్తుందిగా..
వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja)
  • Share this:
రోజా చేతిలో కత్తి ఏంటి.. నరకడం ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇదే చేస్తుంది రోజా. ఎప్పుడూ రాజకీయాలు, షోలు అంటూ బిజీ బిజీగా గడిపే రోజాకు ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా ఖాళీ టైమ్ దొరికింది. దాంతో పూర్తిగా పిల్లలతోనే గడిపేస్తుంది ఈమె. ముఖ్యంగా ఇన్ని రోజులు బయటే ఉంటూ.. ఫుల్ బిజీగా ఉండే ఈమె ఇప్పుడు వంట రూమ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పిల్లలకు కొత్త కొత్త వంటలన్నీ చేసి పెడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తుంది.


కుటుంబంతోనే టైమ్ పాస్ చేస్తుంది రోజా. తాను ఓ సెలబ్రిటీ.. రాజకీయ నాయకురాలు అనే విషయం కూడా ఇప్పుడు ఈమెకు గుర్తు లేదు. ఎంతసేపు సాధారణ గృహిణిలాగే ఆలోచిస్తుంది రోజా. ఎలాగూ లాక్ డౌన్ కారణంగా పని వాళ్లు కూడా అందరికీ సెలవులిచ్చేసారు. దాంతో పూర్తిగా ఎవరి పని వాళ్లే చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు రోజా కూడా ఇదే పనిలో బిజీ అయిపోయింది. రోజూ వంటలు చేస్తూ యూ ట్యూబ్‌లో పెడుతుంది.

అంతేకాదు తయారీ విధానం కూడా చెబుతుంది రోజా. మొన్నటికి మొన్న ఈమె చేసిన చికెన్ ఫ్రై చేసి బండ్ల గణేష్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆ తర్వాత రోజు గుత్తి వంకాయ్ ఫ్రై ఎలా చేయాలో చూపించింది రోజా. మొన్న మళ్లీ కొత్త వంట.. మీ కోసమే రుచికరమైన బీట్‌రూట్ ఛట్నీ అంటూ వచ్చేసింది ఈ జబర్దస్త్ జడ్జి. ఇక ఇప్పుడు చేతిలో కత్తి పట్టుకుని మామిడి కాయలను తెగ నరుకుతుంది. ఎడాపెడా ఎగరేసి నరికేస్తుంది. నోరూరించే ఆవకావ్ పచ్చడి ఇలా పెట్టాలని చూపిస్తుంది ఈ ఎమ్మెల్యే. ఆవకాయ్ చట్నీ తయారీ విధానం కళ్లకు కట్టినట్లు చూపించింది.

మరో రెండు వారాల వరకు పరిస్థితి ఇలాగే ఉండబోతుంది.. సీన్ చూస్తుంటే నెల రోజులు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? అందుకే పూర్తిగా ఇంట్లోనే ఉండి తన పిల్లలకు ఏం కావాలో వండి పెడుతుంది రోజా. మళ్లీ ఇలాంటి టైమ్ జీవితంలో వస్తుందో రాదో తెలియదు. హాలీడేస్ ఉన్నా కుటుంబంతో పాటే బయటికి అడుగు పెట్టకుండా ఉండటం ఎక్కడ సాధ్యపడుతుంది ఈ బిజీ లైఫ్‌లో. అందుకే వచ్చిన సెలవులను ఫుల్లుగా వాడేసుకుంటుంది ఈమె. రోజా మాత్రమే కాదు.. ప్రస్తుతం తెలుగు సినిమా సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలతోనే బిజీ అయిపోయారు. వాళ్ల వాళ్ల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
First published: April 12, 2020, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading