JABARDASTH JODI SUDIGALI SUDHEER RASHMI GAUTAM CREATING WONDERS WITH THEIR FANTASTIC PERFORMANCE IN DHEE CHAMPIONS PK
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. లవ్ బర్డ్స్ ఆఫ్ స్మాల్ స్క్రీన్..
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)
అవును.. నిజంగానే ఇప్పుడు ఇదే అంటున్నారు వీళ్ల తీరు చూసి. అసలు బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు.
అవును.. నిజంగానే ఇప్పుడు ఇదే అంటున్నారు వీళ్ల తీరు చూసి. అసలు బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదరగొట్టింది. తాజాగా ఢీ ఛాంపియన్స్‌లో వాళ్ల లవ్ స్కిట్ అదిరిపోయింది. ముఖ్యంగా ఎపిసోడ్ అంతా డాన్సులు ఉన్నా కూడా వాళ్ల ప్రేమ చుట్టూనే ఈ ఎంటర్టైన్మెంట్ అంతా సాగింది. యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది ఇది.
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)
మొన్నటికి మొన్న ఢీ జోడీ గత సీజన్ ఫైనల్లో ఈ ఇద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపింది. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అయిపోయాయి. అంతగా రప్ఫాడించారు సుధీర్ రష్మీ జోడీ. ఎప్పటికప్పుడు కొత్త డాన్సులతో అలరించే ఈ జోడీ.. ఢీ ఫైనల్ కోసం మరింతగా ప్రిపేర్ అయ్యారు. ఇక ఇప్పుడు కొత్త సీజన్లో కూడా వాళ్ళ ప్రేమలు కొనసాగుతున్నాయి. కొత్త ఎపిసోడ్ కోసం ఒకరిపై ఒకరు ప్రేమలు చూపించుకున్నారు. ముఖ్యంగా సుధీర్‌తో అడిగి మరీ కన్ను కొట్టించుకుంది రష్మీ గౌతమ్.
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)
విడుదలైన క్షణం నుంచే ఈ ఎపిసోడ్ వైరల్ అవుతుంది. యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. అందులో హగ్గులతో చెలరేగిపోయారు సుధీర్, రష్మీ. ఢీ ఫైనల్ ఎపిసోడ్లో పాత కొత్త కాంబినేషన్లో మెడ్లీ చేసారు ఈ జంట. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డాన్స్ ఒక్కటే కాకుండా అందులోనే ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసారు నిర్వాహకులు. దాంతో అటు డాన్సులు, ఇటు కామెడీతో పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించారు సుధీర్ రష్మీ. 1970లో నన్ను వదిలి నీవు పోలేవులే.. 80ల్లో ఎల్లువొచ్చి గోదారమ్మ.. 90ల్లో మామా మామా అంటూ డాన్సులతో రప్ఫాడించారు.
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)
ప్రతీ పాటలోనూ అదిరిపోయే కెమిస్ట్రీతో పిచ్చెక్కించింది ఈ జోడీ. దాంతో మరోసారి రష్మీ, సుధీర్ అంటే బుల్లితెరపై బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఈ జోడీ హోస్టింగ్‌తోనే ఢీ రేటింగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ చేసారు. ఈ సీజన్ ఒక్కటే కాదు.. రాబోయే సీజన్ కూడా సుధీర్, రష్మీ ఉంటారని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. ఏదో ఒక రోజు వెండితెరపై కూడా ఈ జోడీతో ఏదో ఓ దర్శకుడు సినిమా ప్లాన్ చేయకుండా ఉండకపోడూ..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.