JABARDASTH JEEVAN ADMITTED IN ICU COMEDIANS RAM PRASD AND ADIRE ABHI REVEALS IN AI THO SARADAGA SHOW SK
Jabardasth: జబర్దస్త్ టీమ్ లీడర్‌కు తీవ్ర అనారోగ్యం.. షాకింగ్ విషయం చెప్పిన రాంప్రసాద్
జబర్ధస్త్ ఆటో రాంప్రసాద్ (ఫైల్ ఫోటో)
అసలు జీవన్‌కు ఏమైంది? ఏ వ్యాధితో అతడు ఆస్పత్రిలో ఉన్నాడన్న విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు. ఐతే జిగేల్ జీవన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడని తెలియగానే.. జబర్దస్త్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. జీవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు
జబర్దస్త్.. ఈ కామెడీ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఎంతో మంది కమెడియన్స్ వస్తున్నారు.. పోతున్నారు.. కానీ జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. చివరకు నాగబాబు వెళ్లిపోయినా ఎలాంటి ప్రభావం పడలేదు. సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఐతే జబర్దస్త్ కామెడీ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఇప్పటికే ఓ డౌట్ వచ్చి ఉండాలి. కొన్ని రోజులుగా ఓ టీమ్ లీడర్ కనిపించడలేదు. మే 28న చివరి సారిగా స్కిట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఎక్కడా కనిపించలేదు. అతడు జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పాడేమో అని చాలా మంది అనుకున్నారు. లేదంటే షూటింగ్‌ల వల్ల బిజీగా ఉన్నాడమోనని భావించారు. కానీ ఇవేమీ కారణాలు కాదు. అనారోగ్య కారణాలతో జబర్దస్త్‌కు దూరమయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చేరాడు. 50-50 ఛాన్సెస్ అని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా జబర్దస్త్ కమెడియన్స్ రాంప్రసాద్, అదిరే అభి వెల్లడించారు.
ఈటీవీలో ప్రసారమయ్యే 'అలీతో సరదాగా..' కార్యక్రమంలో ఇటీవల జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, అదిరే అభి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ జీవన్ పరిస్థితి గురించి కూడా ఆటో రాంప్రసాద్ తెలిపారు. ''మా జబర్దస్త్‌లో అభి అన్న పెద్ద తలకాయ లాంటివాడు. ఎవరికీ ఏ ఇబ్బందులు ఉన్నా ముందుగా స్పందించేది ఆయనే. అందరం కలిసి ఏం చేయాలన్నా.. ముందు అభికే చెబుతాం. ఇలా చేద్దాం... అలా చేద్దాం.. అని ప్లానింగ్ చెబుతాడు. అందరం డబ్బులను జమచేసి అభికే అప్పజెప్పుతాం. రీసెంట్గా జబర్దస్త్ టీమ్ లీడర్ జిగేల్ జీవన్ అనారోగ్యంతో ఐసీయూలో చేరాడు. డాక్టర్లు చాలా డేంజర్‌గా ఉందని చెప్పారు. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు. అప్పుడు కూడా అభి ముందుండి చూసుకున్నాడు. వాళ్ల అమ్మానాన్నలు కూడా అభికే ఫోన్ చేసేవారు. అతడే నేరుగా డాక్టర్లతో మాట్లాడేవాడు.'' అని చెప్పాడు రాంప్రసాద్.
జిగేల్ జీవన్
అసలు జీవన్‌కు ఏమైంది? ఏ వ్యాధితో అతడు ఆస్పత్రిలో ఉన్నాడన్న విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు. ఐతే జిగేల్ జీవన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడని తెలియగానే.. జబర్దస్త్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. జీవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తమ అభిమాన కమెడియన్ క్షేమంగా తిరిగొస్తాడని.. మళ్లీ జబర్దస్త్‌లో నవ్వు పూయిస్తాడని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. జబర్దస్త్‌లో ఇప్పటికే పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఐనప్పటికీ జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో పనిచేస్తున్నాడు. లోలోపల బాధ ఉన్నా.. పైకి నవ్వుతూ, అందరినీ నవ్విస్తున్నాడు. మరోవైపు హైపర్ ఆది కో టీమ్ లీడర్ రైజింగ్ రాజు కూడా జబర్దస్త్‌కు దూరమయ్యాడు. కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఐతే రాజు ఎందుకు రావడం లేదన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.