జబర్దస్త్ షో లాక్ డౌన్ తర్వాత మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ సారి కూడా జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన పంచులు, ప్రాసలతో జనాలను కడుపుబ్బా నవ్విస్తున్న ప్రోమో విడుదలయ్యింది. అయితే ఈ రీఎంట్రీ షోలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే విశాఖలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో సెక్స్ రాకెట్ లో పట్టుబడిన దొరబాబు, పరదేశీ ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దొరబాబుపై అసలే బూతు కామెంట్స్, బూతు వీడియోల్లో నటించాడంటూ స్కిట్స్‌లో హైపర్ ఆది పంచ్‌లు వేసేవాడు. చివరకు అలానే పట్టుబడటంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో కొత్త ఎపిసోడ్స్ లో దొరబాబుపై ఇక ఏరేంజులో పంచులు వేస్తాడో ఊహకు కూడా అందదని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
నిజానికి హైపర్ ఆది స్కిట్స్ ను సగం బతికించేది.. రైజింగ్ రాజు, దొరబాబు పై వేసే పంచులే కావడం గమనార్హం. అందుకే సెక్స్ రాకెట్ లో పట్టుబడినప్పటికీ దొరబాబు దూరం అయితే స్కిట్స్ లో జీవం పోతుందనే ఆందోళనలో హైపర్ ఆది జబర్దస్త్ నిర్వాహకులను రిక్వెస్ట్ చేసి మరీ టీమ్ లోకి తీసుకున్నాడు. అయితే తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్ ప్రత్యేక గెస్ట్ గా హైపర్ ఆది స్కిట్ చేశాడు. ఇందులో దొరబాబు, పరదేశీలపై వేసిన పంచ్ వారిద్దరూ సెక్స్ రాకెట్ లో పట్టుబడిన సంగతిని గుర్తు చేసే ఉండటంతో అంతా అవాక్కయ్యారు. అదికూడా సుధీర్ ముందే కావడం గమనార్హం. మరి ఇక దొరబాబు ఎలా జీర్ణించుకుంటాడో ఈ అవమానం...చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు హైపర్ ఆది పంచులకు తగ్గట్టుగానే దొరబాబు దొరికిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.