ఏంటి... వర్షిణి హైపర్ ఆదిని అంత మాటనేసింది?

ఎప్పట్లాగే వరుస పంచ్‌లతో ఆది అదరగొడుతుంటే వర్షిణి ఓ బెలూన్ పట్టుకొని మొహం కనిపించకుండా ఎంట్రీ ఇచ్చింది.

news18-telugu
Updated: August 5, 2020, 8:38 PM IST
ఏంటి... వర్షిణి హైపర్ ఆదిని అంత మాటనేసింది?
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
  • Share this:
పవర్ ఫుల్ పంచులతో స్కిట్ ను పండించే హైపర్ ఆదికి ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆది స్కిట్ కోసమే జబర్ధస్త్ చూసే వాళ్లున్నారంటే కాస్త అతిశయోక్తిగా అనిపించినా వాస్తవం కూడా ఉంది. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోలో హైపర్ ఆది, వర్షిణి టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ప్రత్యర్థులుగా బుల్లి తెర హాట్ పెయిర్ రష్మీ, సుడిగాలి సుధీర్. ఇదిలా ఉంటే ఈ సారి జబర్ధస్త్ లో హైపర్ ఆది-రైజింగ్ రాజు టీంకు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది వర్షిణి. ఎప్పట్లాగే వరుస పంచ్‌లతో ఆది అదరగొడుతుంటే వర్షిణి ఓ బెలూన్ పట్టుకొని మొహం కనిపించకుండా ఎంట్రీ ఇచ్చింది. అలా వస్తున్న ఆమెను చూసి ఆది టీంలో ఈ అందమైన అమ్మాయి ఎవరా అన్నట్టు చూస్తూ ఉండిపోయి... వర్షిణి అని తెలిసాక జబర్దస్త్ లో ఈమేంటి అని ఆశ్చర్యపోయారు.

స్కిట్ లో భాగంగా అమ్మాయికి లైన్ వేసే సందర్భంలో హైపర్ ఆది, రైజింగ్ రాజుతో పాటు మరో టీం మేట్ పోటీ పడుతుంటారు. వారి వారి క్వాలిటీస్ చెబుతూ వర్షిణిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఇంతలో ఆది కల్పించుకొని వర్షిణిని పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలి అంటుంటే... వర్షిణి ‘నువ్వు పక్కకెళ్లురా’ అనేస్తుంది. వర్షిణి మాటలకు ఆది ఒకింత షాక్ కు గురైనట్టు కనిపించినా... తర్వాత సర్దుకొని స్కిట్ లో లీనమైపోతాడు. అయితే... వర్షిణి స్కిట్ లోని డైలాగ్స్ లో భాగంగా ఆదిని ‘రా’ అని సంభోదించిందా.. లేక కావాలనే ఆదిని డీగ్రేడ్ చేయడం కోసం అనేసిందా అనే చర్చ యూట్యూబ్ వేదికగా జరుగుతోంది.

సాధారణంగా హైపర్ ఆది స్కిట్లకు తానే స్క్రిప్ట్ రాసుకుంటారు కాబట్టి తనను తాను ఎలివేట్ చేసుకునే విధంగానే రాస్తుంటారు. కానీ వర్షిణితో ‘రా’ అనిపించుకనే సన్నివేశం నిజంగానే ఆది రాసాడా.. లేదంటే వర్షిణినే కాస్త స్పేస్ తీసుకుని అనేసింది అని నెటిజన్లు కామెంట్ల రూపంలో తన అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading