• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JABARDASTH HYPER AADI SHOCKING COMMENTS ON ANCHOR ANASUYA IN LATEST EPISODES NR

Anchor Anasuya: హైపర్ అది నాపై కన్నేశాడంటూ ఎమోషనల్ అయిన యాంకర్ అనసూయ!

Anchor Anasuya

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఇటు బుల్లితెర లో అటు వెండితెర లో స్పెషల్ క్రేజ్ ను అందుకున్న అనసూయ.. ఎంతోమంది అభిమానుల మనసులను కూడా దోచుకుంది.

  • Share this:
    Anchor Anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఇటు బుల్లితెర లో అటు వెండితెర లో స్పెషల్ క్రేజ్ ను అందుకున్న అనసూయ.. ఎంతోమంది అభిమానుల మనసులను కూడా దోచుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫాలోవర్స్ కు కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

    ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ.. తన మాటలతో, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా హైపర్ ఆది తో కలిసి ఎంతో చనువుగా ఉంటూ.. తనతో పాటు స్కిట్ లలో కూడా నటిస్తుంది అనసూయ. అంతేకాకుండా వీరిద్దరి జోడి కూడా జబర్దస్త్ ప్రోగ్రాం లో హైలెట్ గా నిలుస్తుంది. తనదైన పంచులతో హైపర్ ఆది స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ హైపర్ ఆది తనతో చనువుగా ఉండేసరికి.. తన పై కన్నేశాడు అంటూ ఎమోషనల్ అయింది అనసూయ.

    అనసూయ, హైపర్ ఆది కలిసి చేసిన స్కిట్ లలో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అవతలి వారిని ఉద్దేశిస్తూ కూడా తనదైన శైలిలో పంచులు వేస్తాడు హైపర్ ఆది. ఇక తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో అనసూయ బాగా ఎమోషనల్ అయ్యింది. హైపర్ ఆది, శాంతి స్వరూప్ చేసిన స్కిట్ లో.. శాంతి స్వరూప్.. ఆది భార్యగా చేస్తుంది. అంతేకాకుండా అనసూయ శాంతి స్వరూప్ చెల్లెలు గా నటిస్తుంది.

    ఇక ఈ నేపథ్యంలో హైపర్ ఆది మరదలుగా ఉన్న అనసూయ వేదికపైకి రాగా.. ఏంటి మీ చెల్లి తలెత్తదా.. అని అనగా.. వెంటనే అనసూయ మా నాన్నగారు ఎత్తొద్దన్నారు అని సమాధానం చెబుతుంది. ఇక శాంతి స్వరూప్ మా చెల్లి చపాతిలా ఉంటుందని అనగా.. వెంటనే ఆది.. ఆవిడ చపాతిలా ఉంటే.. నువ్వు చపాతీ కర్రతో కొట్టినట్లు ఉంటావు అని పంచ్ వేస్తాడు.



    దీంతో అనసూయ వెంటనే మా అక్క పరువు తీయొద్దు.. తను నాకు ఎన్నో ఇచ్చింది. తను చదువు మానేసి నాకు పలుక ఇచ్చి పంపింది. అంటూ ఎమోషనల్ అయ్యింది. వెంటనే హైపర్ ఆది.. అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకు ఇచ్చి చేసినా బాగుండేది అంటూ తనదైన శైలిలో పంచ్ వేశాడు.
    Published by:Navya Reddy
    First published: