JABARDASTH HYPER AADI ROMANTIC TOUR WITH PRIYAMANI IN DHEE 13 SHOW VIDEO GOES VIRAL ON INTERNET NR
Hyper Aadi - Priyamani: హైపర్ ఆదిని బావా అంటూ రెచ్చిపోయిన ప్రియమణి.. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదంటూ?
hyper aadi priyamani
Hyper Aadi - Priyamani: హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లోకి అడుగుపెట్టి తన పంచ్ లతో, స్కిట్ లతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా నిలిచాడు.
Hyper Aadi - Priyamani: హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లోకి అడుగుపెట్టి తన పంచ్ లతో, స్కిట్ లతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా నిలిచాడు. వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు పాత్రలలో మెప్పించాడు. అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఇక తన స్కిట్ లో భాగంగా డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది.
జబర్దస్త్ లోనే కాకుండా మరో రెండు షోలలో కూడా బాగా బిజీ గా మారాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ మెంబర్ గా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ ప్రియమణితో కలిసి రిసార్ట్ కు వెళ్ళాడు.
నిజంగా వెళ్లారు అంటే పొరపాటే.. షో లో భాగంగా కాస్త ఎంటర్టైన్మెంట్ ను పంచారు. తాజాగా ఢీ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో హైపర్ ఆది.. ప్రియమణి తీసుకొని ఓ రిసార్ట్ కి వెళ్ళాడు. ఇక హైపర్ ఆది.. ప్రియా అని రొమాంటిక్ గా పిలువగా.. బావా అంటూ ప్రియమణి.. ఆదిని ప్రేమగా పిలిచింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అంటూ ఆది ప్రియమణితో అనడం.. నీకు ఏ టిఫిన్ కావాలని అడుగగా.. నీకు ఏది ఇష్టమో.. నాకు అది కావాలి ప్రియమణి అని అనడం బాగా హైలెట్ గా మారింది. ఇక పక్కనే మరో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ సినీనటి పూర్ణ తో కలిసి రిసార్ట్ కి రావడంతో అక్కడ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల మధ్య సంభాషణ బాగా ఆకట్టుకుంది. ఈ ప్రోమో నెట్టింట్లో హల్చల్ గా మారింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.