హైపర్ ఆది.. జబర్దస్త్ షో ద్వారా వెలిగిన మరో ఆణిముత్యం. పంచ్ డైలాగులతోనే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించే కమెడియన్. మంచి టైమింగ్, నటనతో జబర్దస్త్లో ప్రత్యేకత సంపాదించుకున్న ఈ ఆర్టిస్ట్.. మెగా ఫ్యాన్. చిరంజీవి ఇన్పిరేషన్తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, బుల్లి తెరపై నవ్వులు పూయిస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే తెగ ఇష్టపడతాడు. నాగబాబును ఆరాధిస్తాడు. పైగా.. జబర్దస్త్ షోలో నాగబాబు జడ్జిగా ఉన్నన్ని రోజులు తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు.. స్కిట్లలో మెగా సినిమాలను స్ఫూఫ్ చేస్తూ వినోదాన్ని పండించాడు. మెగా అభిమాని కావడం, తనకు దగ్గరగా ఉండటంతో హైపర్ ఆదికి నాగబాబు పలు సినిమాల్లో అవకాశాలు ఇప్పించినట్లు కూడా వార్తలు వచ్చాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో హైపర్ ఆది హీరోతోనే ప్రయాణం సాగిస్తాడు. దాన్ని బట్టే ఆదికి నాగబాబు అవకాశాలు ఇప్పించాడని అర్థం చేసుకోవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఇప్పడు జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నారు. ఓ ఛానల్ నిర్వహిస్తున్న కొత్త షోకు వెళ్లిపోయారు. అదే సమయంలో జనసేనకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త షోకు వెళ్లిపోయిన నాగబాబు.. తనతో పాటు హైపర్ ఆదిని రమ్మని అడిగినట్లు ఊహాగానాలు వినిపించాయి. కొన్ని న్యాయపరమైన చిక్కులతో ఆ ఆఫర్ను హైపర్ ఆది తిరస్కరించినట్లు సమాచారం. ఇది ఎంత వరకు కరెక్టో కాదో తెలీదు కానీ.. ఆది రిప్లైకి నాగబాబు నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఆదికి సినిమా ఛాన్సులు ఇప్పించిన నాగబాబు.. మున్ముందు ఆఫర్లు ఇప్పించేందుకు సిద్ధపడబోరేమోనని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంటే.. దీన్ని బట్టి పలు సినిమా అవకాశాలను ఆది వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.