JABARDASTH HYPER AADI GET SHOCK ON DORABABU GIFT TO HIS WIFE AMULYA MK
జబర్దస్త్ దొరబాబు వాలెంటైన్ డే రోజు భార్య అమూల్యకు ఇచ్చే గిఫ్ట్ చూసి షాక్‌లో హైపర్ ఆది ...
జబర్దస్త్ దొరబాబు (dorababu amulya)
అడల్ట్ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ముందుకు వచ్చిన దొరబాబు ఆ తర్వాత జబర్దస్త్ లో హైపర్ ఆది ప్రోత్సాహంతో స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం సినిమాల్లో సైతం నటిస్తున్న దొరబాబు, సరిలేరు మీకెవ్వరూ సినిమాలో ఏకంగా మహేష్ బాబుకు సోదరుడి కారెక్టర్ వేశాడు.
బుల్లితెరపై తన నటనతో పాటు, వివాదాలతోనూ సెంటర్ ఆఫ్ ట్రాక్షన్ గా మారిన దొరబాబు, జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అడల్ట్ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ముందుకు వచ్చిన దొరబాబు ఆ తర్వాత జబర్దస్త్ లో హైపర్ ఆది ప్రోత్సాహంతో స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం సినిమాల్లో సైతం నటిస్తున్న దొరబాబు, సరిలేరు మీకెవ్వరూ సినిమాలో ఏకంగా మహేష్ బాబుకు సోదరుడి కారెక్టర్ వేశాడు. అయితే దొరబాబు తనకెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క ఇన్సిడెంట్‌తో పోగొట్టుకున్నాడు. వైజాగ్ లో అనుకోకుండా దొరబాబు పోలీసులకు వ్యభిచారం కేసులో దొరికిపోయాడు. ఆ సమయంలో దొరబాబును మీడియా అంతా ఏకి పారేసింది. అందరూ బ్రేకింగ్ న్యూస్ వేసి మరీ అతడి పరువు తీసేశారు. అయితే ప్రస్తుతం ఆ ఘటన అంతా మరిచిపోయారు. మళ్లీ దొరబాబు ఎప్పటిలాగే జబర్దస్త్ కూడా చేసుకుంటున్నాడు. అయితే ఎంత అపవాదు వచ్చినప్పటికీ దొరబాబు కు అతడి భార్య చాలా అండగా నిలిచింది.
నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్యను రెండేళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది. దొరబాబుపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా అమూల్య తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సమాధానం చెబుతుంది. ఇప్పుడు కూడా తనతో పాటు భర్తపై కూడా బ్యాడ్ కమెంట్స్ చేస్తున్న వాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పింది తనపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్లను కూడా కుక్కలతోనే పోల్చింది. ఓ వ్యక్తిని అపార్థం చేసుకునేటప్పుడు గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడనేది మరిచిపోకూడదు.. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం.. అవి కూడా మనను మోసం చేస్తుంటాయి.. అంటూ అప్పట్లో ఓ పోస్ట్ కూడా పెట్టింది అమూల్య,
అయితే తనకు ప్రాణ ప్రదంగా కష్ట కాలంలో అండగా నిలిచి తన భార్య అమూల్యకు దొరబాబు ఈ వాలెంటైన్ డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. ఎందుకంటే అమూల్య మొదటి నుంచి టీవీ యాంకర్ గా అనుభవం ఉండటంతో తన కెరీర్ కోసం కూడా దొరబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దొరబాబు ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటి అనేది వాలెంటైన్ డే రోజు అమూల్య సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తెలుసుకునే వీలుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.