జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అయిన కమెడియన్ హైపర్ ఆది. ఆది చేసిన కామెడీ అంటే అందరూ పడిచచ్చిపోతుంటారు. అందుకే హైపర్ ఆదికి వీరాభిమానులు కూడా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు హైపర్ ఆది కామెడీ కడుపునిండా నవ్వులు పూయిస్తూంది. హైపర్ ఆది స్టేజ్‌పై ఏ స్కిట్ వేసిన అదిరిపోవాల్సిందే. జబర్దస్త్ ప్రేక్షకులంతా ఆది స్కిట్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటారు. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది.. కామెడీ స్కీట్లకు పునాది కాలేజీ రోజుల్లోనే పడింది. తాజాగా హైపర్ ఆది కాలేజీ రోజుల్లో చేసిన స్కిట్ ఒటి ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ స్కిట్లో ఆది చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. కాలేజ్ డేస్‌లో తన ఫ్రెండ్స్ ముందు ఆది చేసిన ఈ అద్భుతమైన స్కిట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ స్కిట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేస్తూ... ఆది చేసిన ఈ స్కిట్‌కు అతని దోస్తులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. రూంలోనే కడుపబ్బా నవ్వుకున్నారు. ఎగ్జామ్స్, స్టూడెంట్స్, చదువులు గురించి పవన్ కల్యాణ స్టైల్లో మాట్లాడుతూ తన స్నేహితులకు ఫుల్ ఎంటర్టైన్ చేశాడు ఆది. ఈ వీడియోను చూసిన వారంతా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాలేజ్ ఇష్యూలపై ఆది చేసిన స్కిట్ సూపర్ అంటూ కొందరు అభిమానులు పొగడ్తలు కురిపిస్తున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.