హైపర్ ఆది నీకు సిగ్గుందా...సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్...

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

హైపర్ ఆదిని, ప్రముఖ జర్నలిస్టు, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్ వేసిన ప్రశ్న ప్రస్తుతం సంచలనంగా మారింది. అందులో హైపర్ ఆదికి సిగ్గుందా..అంటూ ఒక వ్యక్తిని అతడు బాడీ షేమింగ్ చేసినందుకు అలాంటి వ్యాఖ్యలు బయట వినిపించినట్లు అతడి దృష్టికి తెచ్చాడు.

  • Share this:
    హైపర్ ఆది జబర్దస్త్ లో ఒక సంచలనం అనే చెప్పవచ్చు. అలాంటిది హైపర్ ఆది ఈ మధ్య తరచూ వివాదాల్లో తల దూరుస్తున్నాడు. అయితే తాజాగా న్యూఇయర్ వేడుకల్లో భాగంగా విడుదలైన ఒక ప్రోమోలో హైపర్ ఆదిని, ప్రముఖ జర్నలిస్టు, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్ వేసిన ప్రశ్న ప్రస్తుతం సంచలనంగా మారింది. అందులో హైపర్ ఆదికి సిగ్గుందా..అంటూ ఒక వ్యక్తిని అతడు బాడీ షేమింగ్ చేసినందుకు అలాంటి వ్యాఖ్యలు బయట వినిపించినట్లు అతడి దృష్టికి తెచ్చాడు. దీంతో ఒక్కసారిగా హైపర్ ఆది షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. గతంలో హైపర్ ఆది, అలాగే సినీ విమర్శకుడు కత్తి మహేష్ నడుమ పెద్ద గొడవే నడిచింది. ఇద్దరూ పలు న్యూస్ చానెళ్ల వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని విమర్శించుకున్నారు. అప్పట్లో హైపర్ ఆది సైతం అతడిని ఉద్దేశిస్తూ స్కిట్స్ లో పంచులు వేసేవాడు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు జాఫర్ ఈ ప్రశ్న వేసినట్లు తెలుస్తోందని నెట్టింట టాక్ నడుస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: