‘అనసూయ చేయి పట్టుకున్న హైపర్ ఆది.. భయం పట్టుకున్న భరద్వాజ్..’

అనసూయ, హైపర్ ఆది

Jabardasth : రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ తర్వాత జబర్దస్త్‌లో అనసూయ, హైపర్ ఆది గురించే అందరూ చర్చించుకుంటారు. వీరిద్దరి మధ్య ఏం లేకపోయినా ఉందన్నట్లు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. అయితే.. బయట వార్తలు ఇంతలా వస్తున్న హైపర్ ఆది, అనసూయ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

  • Share this:
    రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ తర్వాత జబర్దస్త్‌లో అనసూయ, హైపర్ ఆది గురించే అందరూ చర్చించుకుంటారు. వీరిద్దరి మధ్య ఏం లేకపోయినా ఉందన్నట్లు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. అయితే.. బయట వార్తలు ఇంతలా వస్తున్న హైపర్ ఆది, అనసూయ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నకి మొన్న స్కూటీపై అనసూయను వేదిక మీదకు తీసుకొచ్చిన హైపర్ ఆది.. తాజాగా రిక్షాలో ఆమెను తీసుకొచ్చాడు. లేనిపోని హైప్ క్రియేట్ చేస్తూ రేటింగ్ పెంచుకునేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడు. వివరాల్లోకెళితే.. వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేశారు. అందులో అనసూయను రిక్షాపై తీసుకొచ్చిన సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో భాగంగా అనసూయ చేయి పట్టుకోబోయాడు. వెంటనే.. దీని గురించి కూడా వార్తలు రాస్తారని వ్యాఖ్యలు చేశాడు. ‘అనసూయ చేయి పట్టుకున్న హైపర్ ఆది.. భయం పట్టుకున్న భరద్వాజ్..’ అని కూడా హెడ్డింగ్ పెట్టుకోండంటూ సెటైర్ వేశాడు. ‘అలాంటప్పుడు.. స్కిట్‌ రేటింగ్ పెంచుకోవడం కోసం అనసూయతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు నటించడం ఎందుకు?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి.

    రష్మీ, సుధీర్ గురించి మాట్లాడుకున్నా, హైపర్ ఆది, అనసూయ గురించి చర్చించుకున్నా.. దానికి వాళ్లు స్కిట్‌లలో, ప్రోగ్రాంలలో చేసే అతి వల్లేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎవ్వరి మీదా రాని గాసిప్స్ వీళ్ల మధ్యే వస్తుందంటే.. వాళ్లు చేసే హైప్ వల్లేనని స్పష్టం చేస్తున్నారు. కాగా, సెటైర్లు, పంచ్‌లు వేయడంలో తనదైన శైలిని ప్రదర్శించే హైపర్ ఆది అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం తెలిసిన విషయమే.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: