శేఖర్ మాస్టర్ పై హైపర్ ఆది సీరియస్...వర్షిణి విషయంలో లిమిట్స్ క్రాస్ చేయొద్దంటూ...కోపం తట్టుకోలేక...

హైపర్ ఆది, వర్షిణి Photo : Youtube

అనసూయ, రష్మీలతో పోటీ పడలేక అటు కామెడీ షోస్ స్టార్ట్ చేసిన వారంతా యాంకర్ దొరక్క షోస్ ఆపేస్తుంటే....ఇప్పుడు వారికి వర్షిణి ఒక వరంలా మారింది. అయితే అనసూయ, రష్మీ అంత కాకపోయినా వర్షిణి తన నవ్వులతో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం నడపాలని చూస్తోంది.

 • Share this:
  శేఖర్ మాస్టర్ అంటే యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఢీ డాన్స్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన శేఖర్ మాస్టర్ చాలా చిన్న వయస్సులోనే డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు. అంతేకాదు తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రోత్సహించడంలో శేఖర్ మాస్టర్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. రాకేష్ మాస్టర్ దగ్గర డాన్సింగ్ ఓనమాలు నేర్చుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ ఇలా అందరు స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. అయితే అటు రియాలిటీ షోస్ లో కూడా హోస్ట్ గా శేఖర్ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఢీ షో అయితే అప్రతిహతంగా కొనసాగుతోంది. అటు జబర్దస్త్ లో కూడా గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత సింగర్ మనో ఎంట్రీతో వెనకడుగు వేశారు. అయినప్పటికీ, శేఖర్ మాస్టర్ కు కామెడీ షోస్ మీద ఉన్న మమకారం చావలేదు. దీంతో తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంకు గెస్ట్ గా వెళ్తున్నారు. ఇందులో శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో ఇఫ్పటికే అదిరిందీ షో ద్వారా బయటకు వచ్చిన కమెడియన్స్ అంతా జట్టు కట్టారు. వీరితో పాటు బిగ్ బాస్ ద్వారా స్టార్ మా కుటుంబంలో అడుగుపెట్టిన ముక్కు అవినాశ్ కూడా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

  ఇప్పటికే అనసూయ, రష్మీలతో పోటీ పడలేక అటు కామెడీ షోస్ స్టార్ట్ చేసిన వారంతా యాంకర్ దొరక్క షోస్ ఆపేస్తుంటే....ఇప్పుడు వారికి వర్షిణి ఒక వరంలా మారింది. అయితే అనసూయ, రష్మీ అంత కాకపోయినా వర్షిణి తన నవ్వులతో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం నడపాలని చూస్తోంది. అయితే నిజానికి వర్షిణి గతంలో ఢీ షోలో హోస్ట్ గా చేసింది. హైపర్ ఆదితో కలిసి రొమాన్స్ పండించింది. ఇప్పుడు సడెన్ గా మల్లెమాలకు టాటా చెప్పి, హైపర్ ఆదిని ఒంటరి చేసి కామెడీ స్టార్స్ యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది.

  అయితే వర్షిణి నిర్ణయం వెనుక శేఖర్ మాస్టర్ ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి వర్షిణి, హైపర్ ఆది కలిసి ఓ ప్రత్యేక ప్రోగ్రాంను మల్లెమాల ఆధ్వర్యంలో రావాల్సి ఉంది. అయితే ఈ విషయం తేలకముందే మంచి క్రేజీ ఆఫర్ ను శేఖర్ మాస్టర్ ఆఫర్ చేయడంతో, వర్షిణి జెండా ఎత్తేసి స్టార్ మాలో అడుగుపెట్టేసింది. దీంతో హైపర్ ఆది ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం శేఖర్ మాస్టరే అనే కోపంతో హైపర్ ఆది కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. కానీ వర్షిణి మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనేది టాక్ వినిపిస్తోంది. కానీ హైపర్ ఆది మాత్రం శేఖర్ మాస్టర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
  Published by:Krishna Adithya
  First published: