Anchor Rashmi - Hyper Aadi: బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు మాత్రం తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేస్తుంటారు. ఇక కొన్ని కొన్ని సమయాలలో తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇక జబర్దస్త్ నుండి పరిచయమైన హైపర్ ఆది కూడా తన పంచ్ లతో, తన మాటలతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్ యు వర్జిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
జబర్దస్త్ లో హైపర్ స్టార్ కమెడియన్ గా నిలిచి మరిన్ని షోలలో కూడా బాగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. ఇక ఇందులో కూడా తన మాటలతో తెగ ట్రోల్స్ చేస్తుంటాడు. ఇక ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఢీ డాన్స్ షో కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఇక ఇందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రష్మీ, దీపిక పిల్లి టీం లీడర్స్ గా చేస్తున్నారు. ప్రదీప్ యాంకరింగ్ చేస్తూ తెగ సందడి చేస్తుంటాడు. ఇక ఈ ప్రోమో లో డాన్సర్లు తమ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు. ఇక రష్మీ, దీపిక లు ఆది, సుధీర్ తో మేము ఇక్కడ గెలిచాము.. మీరు ఇప్పుడు టాస్క్ చేయాలి అని అనడంతో.. వెంటనే ఆది టాస్క్ చెయ్యమూ మాకు మూడు లేదు అన్నాడు. ఇక రష్మీ ఫైర్ అవుతూ మాకు మూడ్ ఉంది మీరు టాస్క్ చేయాలి అనడంతో.. మీకు మూడు ఉంటే మీరు చేయండి అంటూ కామెంట్ చేశాడు ఆది.
దాంతో రష్మీ షాక్ అవుతూ కనిపించింది. ఇక సుధీర్ టాస్క్ చేద్దామని ఆదిను కోరగా.. వెంటనే వకీల్ సాబ్ లో కోర్టు సన్నివేశంలో పవన్ మాట్లాడిన డైలాగ్స్ ను వాడాడు. ఇక ఫైనల్ గా ఒక ప్రశ్న అంటూ ఆర్ యు వర్జిన్ అంటూ సుధీర్ రెండుసార్లు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా సుధీర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నవ్వుకున్నారు. ఇక రష్మీ కూడా ఆ మాటకు షాక్ అవుతూ కనిపించగా మళ్లీ తేరుకొని తెగ నవ్వుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమోలో వీరి పర్ఫామెన్స్ బాగా హైలెట్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Deepika pilli, Dhee show, Hyper Aadi, Jabardasth, Sudigali sudheer