హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ వల్లే గెటప్‌ శ్రీనుకు లవ్ మ్యారేజ్

సుడిగాలి సుధీర్ వల్లే గెటప్‌ శ్రీనుకు లవ్ మ్యారేజ్

jabardasth: తను భార్య సుజాత, సుధీర్ చిన్నప్పటి నుంచి మిత్రులని.. చిన్నతనంలో పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవారని చెప్పాడు.

jabardasth: తను భార్య సుజాత, సుధీర్ చిన్నప్పటి నుంచి మిత్రులని.. చిన్నతనంలో పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవారని చెప్పాడు.

jabardasth: తను భార్య సుజాత, సుధీర్ చిన్నప్పటి నుంచి మిత్రులని.. చిన్నతనంలో పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవారని చెప్పాడు.

  జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్‌కు జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టేజిపై సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను చేసే అల్లరికి జడ్జిలు రోజా, నాగబాబుతో పాటు ఆడియెన్స్ కూడా పగలబడి నవ్వుంతుంటారు. ఆటో పంచులతో రాంప్రసాద్ అదరగొడితే.. ఎక్స్‌ప్రెషన్స్‌తో సుధీర్ చింపేస్తాడు. ఇక వెరైటీ గెటప్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు శ్రీను. వీరిలో సుడిగాలి సుధీర్ పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు పుట్టకొస్తుంటాయి. రష్మి,సుధీర్ రిలేషన్‌షిప్‌పైనా రోజుకో వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్‌పై అతడి ఫ్రెండ్ గెటప్ శ్రీను నోరువిప్పాడు.

  సుడిగాలి సుధీర్‌కు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. అతడి పెళ్లి విషయంలో తనకు కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయని చెప్పాడు శ్రీను. మెయిల్ ఐడీకి వివరాలు పంపిస్తూ, తమను రెఫర్ చేయమని చాలా మంది కోరుతున్నారని తెలిపాడు. ఐతే కొన్ని జాతకాలు సెట్ కావట్లేదన్న శ్రీను.. సుధీర్ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నారని వెల్లడించాడు.

  అంతేకాదు తన భార్య సుజాతకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఓ యూబ్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు శ్రీను. తను భార్య సుజాత, సుధీర్ చిన్నప్పటి నుంచి మిత్రులని.. చిన్నతనంలో పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవారని చెప్పాడు. వాళ్లిద్దరు మంచి స్నేహితులన్న సుధీర్.. టెన్త్ తర్వాత సుధీర్ హైదరాబాద్ వచ్చాడని పేర్కొన్నాడు. సుజాత బీటెక్ పూర్తయ్యాక, జాబ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు సుధీర్ తనకు పరిచయం చేశాడని తెలిపాడు. ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నామని చెప్పాడు శ్రీను.

  First published:

  Tags: Jabardasth, Jabardasth getup srinu, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు