Jabardast Getup Srinu: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో పాల్గొనే కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు.
Jabardast Getup Srinu: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో పాల్గొనే కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న గెటప్ శ్రీను.. తన కామెడీతో స్టార్ కమెడియన్ గా నిలిచాడు.
ఎన్నో అడ్డంకులను.. సమయానికి తిండి లేని పరిస్థితులను ఎదుర్కొని జబర్దస్త్ లో పరిచయమయ్యి అతి తక్కువ సమయంలో మంచి కమెడియన్ గా నిలిచాడు శ్రీను. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొత్త కొత్త గెటప్ లతో ఎంట్రీ ఇస్తూ గెటప్ శ్రీను గా పేరు తెచ్చుకున్నాడు. వెండితెరపై కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే జబర్దస్త్ లో బాగా రచ్చ చేస్తూ కనిపించాడు.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కమెడియన్స్ తమ పెర్ఫార్మెన్స్ లతో బాగా ఆకట్టుకున్నారు. ఎంట్రీ తోనే సుడిగాలి సుధీర్ తెగ పంచ్ లు ఎదుర్కొన్నాడు. బుల్లెట్ భాస్కర్ తన స్కిట్ తో తెగ నవ్వించాడు. ఇక గెటప్ శ్రీను ఎంట్రీ ఇవ్వగా.. పక్కనే గొడుగులు అమ్ముతున్న ఆటో రాంప్రసాద్ దగ్గరికెళ్లి రివర్స్ పంచ్ ఎదుర్కొన్నాడు.ఇక సుధీర్ మీ ఊర్లో ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. దాంతో ప్లే స్కూల్ అని సమాధానం ఇవ్వగా.. అది చేపలు తిరిగే ప్లే స్కూల్ అని తెలిపాడు.
అదే సమయంలో శ్రీనుకు ఓ ఫోన్ వస్తుంది. ఇక అందులో ఎవరు ఎవరు అని ప్రశ్నించడంతో.. అయ్య బాబోయ్ పిల్లాడు పుట్టాడు అంటూ సుధీర్ ను, రాంప్రసాద్ ను కౌగిలించుకొని రచ్చ చేశాడు. ఇక సుధీర్ కంగ్రాట్స్ అంటూ.. ఎవరు మీ బాబా అని అనగా.. లేదు శీలావతి చేపకు మగపిల్లాడు పుట్టాడు అంటూ పంచ్ వేశాడు. దీంతో సుధీర్, రాంప్రసాద్ తెల్లముఖం వేయగా అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.