JABARDASTH GETUP SRINU PRAISED HYPER AADI FOR HIS PERFORMANCE BEHIND THE STORY MK
సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన గెటప్ శ్రీను...హైపర్ ఆదితో కలిసి సరికొత్త టీమ్...
గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది
గెటప్ శ్రీను టాలెంట్ అంతా ఇంతా కాదు. అతడిని బుల్లితెర కమల్ హాసన్ అంటారు. అలాంటిది గెటప్ శ్రీను ఇప్పటి వరకూ టీమ్ లీడర్ అవ్వలేదు. ఇందుకు సుడిగాలి సుధీర్ టీమ్ లోనే అతడు కొనసాగుతున్న కారణంగానే కొత్త టీమ్ పెట్టలేకపోయాడనే టాక్ ఉంది.
సుడిగాలి సుధీర్ అంటే జబర్దస్త్ లో ఒక ప్రత్యేకత ఉంది. రాంప్రసాద్, గెటప్ శ్రీను జట్టుగా వచ్చే సుడిగాలి సుధీర్ జత కడితే నవ్వుల పంటే...అందుకే సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎన్ని ఆటు పోట్లు వచ్చిన వీరు ముగ్గురు కలిసే ఉన్నారు. అటు ప్రొఫెషనల్‌గానూ, పర్సనల్ గానూ వీరు ముగ్గురూ స్నేహానికి ప్రతిరూపం అనే చెప్పవచ్చు. అలాంటిది గెటప్ శ్రీను తాజాగా వీరి స్నేహంలో మంట పెట్టేశాడనే కామెంట్స్ వస్తున్నాయి. గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. గెటప్ శ్రీను టాలెంట్ అంతా ఇంతా కాదు. అతడిని బుల్లితెర కమల్ హాసన్ అంటారు. అలాంటిది గెటప్ శ్రీను ఇప్పటి వరకూ టీమ్ లీడర్ అవ్వలేదు. ఇందుకు సుడిగాలి సుధీర్ టీమ్ లోనే అతడు కొనసాగుతున్న కారణంగానే కొత్త టీమ్ పెట్టలేకపోయాడనే టాక్ ఉంది.
సుడిగాలి సుధీర్ టీమ్ తర్వాత జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ కూడా పెర్ఫార్మన్స్ కన్నా పంచులనే నమ్ముకొని పైకి వచ్చింది. అయితే తాజాగా న్యూఇయర్ ప్రోమోలో గెటప్ శ్రీను ఆశ్చర్యకరంగా హైపర్ ఆదిని ఆకాశానికెత్తేస్తూ పొగిడేశాడు. అందుకు కారణం లేకపోలేదు. హైపర్ ఆది టీమ్ పంచుల్లో ఫస్ట్ అయినప్పటికీ, స్క్రిప్ట్ పరంగా కొద్దిగా వీక్ అనే టాక్ ఉంది. అయితే సుడిగాలి సుధీర్ టీమ్ మాత్రం స్క్రిప్ట్ పరంగా చాలా స్ట్రాంగ్. అయితే హైపర్ ఆది టీమ్ లోకి గెటప్ శ్రీను కనుక వస్తే స్క్రిప్ట్ పరంగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో గెటప్ శ్రీను త్వరలోనే హైపర్ ఆదితో కలిసి కొత్త టీమ్ పెడుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.