Home /News /movies /

JABARDASTH GETUP SRINU MAKES CRY ALL WITH HIS EMOTIONAL SKIT ON FORMERS IN DJ NEW YEAR EVENT PK

Jabardasth Getup Srinu: గొంతు కోసుకున్న గెటప్ శ్రీను.. అనసూయ, రష్మి గౌతమ్, రోజా కన్నీరు..

జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)

జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)

Jabardasth Getup Srinu: జబర్దస్త్ కామెడీ షో అంటే కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. అందులో కొందరు అద్భుతమైన నటులు కూడా ఉన్నారు. వాళ్లు కేవలం కామెడీ మాత్రమే కాదు ఏమిచ్చినా చేస్తారు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పిస్తారు.

జబర్దస్త్ కామెడీ షో అంటే కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. అందులో కొందరు అద్భుతమైన నటులు కూడా ఉన్నారు. వాళ్లు కేవలం కామెడీ మాత్రమే కాదు ఏమిచ్చినా చేస్తారు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పిస్తారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు గెటప్ శ్రీను. ఈయన్ని ఏకంగా బుల్లితెర కమల్ హాసన్ అంటూ అప్పట్లోనే నాగబాబు కన్ఫర్మ్ చేసాడు. వారానికో గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఇదిలా ఉంటే తాజాగా ఈయన చేసిన స్కిట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో డిజే అనే కార్యక్రమం వచ్చింది. అందులో గెటప్ శ్రీను చేసిన యాక్ట్ అందర్నీ ఆకట్టుకుంది.. కంటతడి పెట్టించింది. కోట్లాది మంది రైతుల బాధలను కళ్లకు కడుతూ డిజేలో ఓ స్కిట్ చేసారు. మహర్షి సినిమాలోని భళ్లుమంటూ నింగి అనే పాటకు ఈయన పర్ఫార్మ్ చేసాడు. రైతులు పంట వేసేటప్పటి నుంచి కోసేవరకు పడే కష్టాలు.. అలాగే దళారులు, వ్యాపారుల చేతిలో వాళ్లు ఎలా బలవుతున్నారు అనే విషయాలు ఈ స్కిట్‌లో చూపించాడు గెటప్ శ్రీను. అందులో రైతుగా నటించాడు ఈయన. వ్యాపారిగా బుల్లెట్ భాస్కర్ కనిపించాడు. ఈ స్కిట్‌లో భాగంగానే గెటప్ శ్రీను రైతుగా నటించలేదు.. ఏకంగా జీవించేసాడు.

ఇందులో గెటప్ శ్రీను చేసిన పర్ఫామెన్స్ చూస్తున్నంత సేపు అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. చివరికి రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే దళారుల చేతిలో రైతులు మోసపోవడంతో ఆయన ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుంటాడు. గొంతు కోసుకుంటూ రైతు బాధ అందరికీ తెలియాలంటూ రైతే రాజు అంటూ ప్రాణాలు విడుస్తాడు గెటప్ శ్రీను. ఈ స్కిట్ చూసి అక్కడే ఉన్న రోజా, రష్మి గౌతమ్, అనసూయతో పాటు అంతా కన్నీరు పెట్టుకున్నారు. గెటప్ శీను గొంతు కోసుకున్న సమయంలో రక్తం పడినట్లుగా ఎఫెక్ట్స్ కూడా వేసారు. దాంతో ఆ స్కిట్ మరింత రక్తి కట్టింది. ఏదేమైనా కూడా కేవలం కామెడీ మాత్రమే కాదు మేం అన్నీ చేయగలం అంటూ గెటప్ శ్రీను లాంటి నటులు నిరూపిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth getup srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు