రోజా ఎదురుగా జగన్ మీద గెటప్ శ్రీను పంచ్...జబర్దస్త్ షో మధ్యలోనే...

సాధారణంగా గెటప్ శ్రీను ఇలాంటి వివాదాల జోలికి పెద్దగా వెళ్లడు. అయితే డిసెంబర్ 6న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో గెటప్ శ్రీను వేసిన పంచ్ కు జడ్జి స్థానంలోని రోజా షాక్ తిన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: December 1, 2019, 9:52 PM IST
రోజా ఎదురుగా జగన్ మీద గెటప్ శ్రీను పంచ్...జబర్దస్త్ షో మధ్యలోనే...
జబర్దస్త్ గెటప్ శ్రీను, రోజా
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య సమకాలీన రాజకీయాలపై పంచులు వేయడం కామన్ అయిపోయింది. గతంలో ఈ పని ఎక్కువగా హైపర్ ఆది చేసేవాడు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ లో జడ్జి రోజాపైనే గెటప్ శ్రీను వేసిన పంచ్ హాట్ టాపిగ్గా నిలిచింది. సాధారణంగా గెటప్ శ్రీను ఇలాంటి వివాదాల జోలికి పెద్దగా వెళ్లడు. అయితే డిసెంబర్ 6న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో గెటప్ శ్రీను వేసిన పంచ్ కు జడ్జి స్థానంలోని రోజా షాక్ తిన్నట్లు సమాచారం. స్కిట్ లో భాగంగా గెటప్ శ్రీను రాత్రి బస్సు ఎక్కి ఊరెళ్లాను అంటాడు. అందుకు కోరస్ గా రోజా ఎర్రబస్సు ఎక్కావా అంటూ పంచ్ వేసింది. అందుకు శ్రీను రివర్స్ పంచ్ వేస్తూ ఈ మధ్య కాలంలో బస్సుల కలర్ మార్చేశారు...అంటూ జవాబిచ్చాడు. దీంతో జడ్జి రోజా నోట మాటరాలేదు.

అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులను వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెటప్ శ్రీను పంచ్ వేశాడని సోషల్ మీడియా వేదికగా వాదనలు వినిపిస్తున్నాయి.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>