Home /News /movies /

JABARDASTH GETUP SRINU GOT CHANCE IN CHIRANJEEVI KORATALA SIVA MOVIE MS

బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ గెటప్ శ్రీను.. ఎవరి సినిమాలో చేస్తున్నాడో తెలుసా..?

గెటప్ శ్రీను

గెటప్ శ్రీను

Jabardasth Getup Srinu : ఇటీవల జబర్దస్త్ టీమ్‌తో కలిసి చిరంజీవిని కలిసేందుకు వెళ్లినప్పుడు.. కొరటాల సినిమా గురించి చిరు ప్రస్తావించినట్టు చెప్పాడు.

    జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పనటికీ.. గెటప్ శ్రీనుకు మాత్రం ఇప్పటికే సంకేతాలు అందాయట. ఈ విషయాన్ని గెటప్ శ్రీను స్వయంగా వెల్లడించాడు. ఇటీవల జబర్దస్త్ టీమ్‌తో కలిసి చిరంజీవిని కలిసేందుకు వెళ్లినప్పుడు.. కొరటాల సినిమా గురించి చిరు ప్రస్తావించినట్టు చెప్పాడు. ఆ సినిమాలో కొరటాల శివ నీకూ ఓ క్యారెక్టర్ అనుకుంటున్నాడని చిరు చెప్పగానే చాలా సంతోషంగా ఫీలైనట్టు తెలిపాడు. ఇప్పటివకే చిరు 150వ సినిమాలో నటించిన గెటప్ శ్రీను ఇక చిరు 152వ సినిమాలో నటించే ఛాన్స్ కూడా వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుందన్నాడు.అయితే అధికారికంగా తనకూ కన్ఫర్మేషన్ రావాల్సి ఉందన్నాడు.

    ఇదిలా ఉంటే, ఇటీవల జబర్దస్త్ జడ్జి నాగబాబు కూడా గెటప్ శ్రీనుపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. గెటప్ శ్రీను వైవిధ్యమైన నటుడని.. అలాంటి నటుడిని వాడుకోకపోతే ఇండస్ట్రీయే నష్టపోతుందని అన్నాడు.ఏ భాషలోనైనా సరే.. అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే సత్తా ఉన్న నటుడు గెటప్ శ్రీను అని ప్రశంసించారు. ప్రస్తుతం గెటప్ శ్రీను 'త్రీ మంకీస్' సినిమాలో నటిస్తున్నాడు. మరికొద్ది సినిమాలు కూడా క్యూలో ఉన్నట్టు సమాచారం.ఏదేమైనా చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే మాత్రం గెటప్ శ్రీనుకి ఇక తిరుగులేనట్టే.
    First published:

    Tags: Getup srinu, Jabardasth, Jabardasth getup srinu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు