హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth Getup Srinu: జబర్దస్త్ గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా..?

Jabardasth Getup Srinu: జబర్దస్త్ గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా..?

గెటప్ శ్రీను కూడా హీరో అయ్యాడు. ఈయన హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విభిన్నమైన గెటప్స్‌లో కనిపించాడు శ్రీను.

గెటప్ శ్రీను కూడా హీరో అయ్యాడు. ఈయన హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విభిన్నమైన గెటప్స్‌లో కనిపించాడు శ్రీను.

Jabardasth Getup Srinu: బజర్ధస్త్‌లో గెటప్ శ్రీను (Jabardasth Getup Srinu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా టీమ్ లీడర్ కాకపోయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీను.

ఇంకా చదవండి ...

బజర్ధస్త్‌లో గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా టీమ్ లీడర్ కాకపోయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీను. బుల్లితెర కమల్ హాసన్ అంటూ బిరుదు కూడా సంపాదించుకున్నాడు. జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను వేసే స్కిట్స్‌కు ఆడియన్స్ ఎంతగానో నవ్వుకుంటారు. స్మాల్ స్క్రీన్‌పై వీరిద్దరి జోడిగా చేసే కామెడీ ఎంతో పాపులర్ అయింది. సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ కామెడీ షోతో వచ్చిన గుర్తింపుతో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను పలు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో వరుస ఛాన్సెస్ వచ్చినా.. గెటప్ శ్రీను తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ కామెడీ షోను మాత్రం విడిచిపెట్టలేదు. అంతేకాదు సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఆ మధ్య కొన్ని వారాలు ఈయన టీమ్‌లో కనిపించపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

సుడిగాలి సుధీర్.. ఆటో రాంప్రసాద్, సన్నితోనే షోను నెట్టుకొచ్చారు. ఈ సంఘటనలతో గెటప్ శ్రీను జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సుడిగాలి సుధీర్ కారణం అనే మాటలు కూడా వినిపించాయి. ఈ షోతో సుడిగాలి సుధీర్ కంటే గెటప్‌ శ్రీనుకే ఎక్కువ పేరు రావడంతో ఈయనకు తెలివిగా ఈ షోను తప్పకునేలా చేసారనే మాటలు వినిపించాయి. ఈ విషయమై.. సుడిగాలి సుధీర్ టీమ్‌ కానీ.. గెటప్ శ్రీను మాత్రం ఎక్కడ ఏ విషయం మాట్లాడలేదు.

jabardasth getup srinu,jabardasth getup srinu wife,jabardasth,jabardasth getup srinu comedy,jabardasth getup srinu family,jabardasth getup srinu income,jabardasth getup srinu struggles,jabardasth getup srinu performance,jabardasth getup srinu sudigali sudheer,friday poster getup srinu,extra jabardasth,getup srinu,nagababu very emotional speech about jabardasth getup srinu,getup sreenu,super sreenu,జబర్దస్త్ గెటప్ శ్రీను,గెటప్ శ్రీను,కొరటాల శివ,చిరంజీవి,చిరంజీవి 152వ సినిమా
జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)

అంతేకాదు గత కొన్నేళ్లుగా జబర్ధస్త్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ముందు జబర్ధస్త్‌ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ ఈ షోను విడిచి వెళ్లారు. వాళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఈ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. ఇక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా జబర్ధస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు బిగ్‌బాస్ షో కోసం ముక్కు అవినాష్ కూడా ఈ షోను ఒదులుకున్నారు. ఈ క్రమంలో షోకు గెటప్ శ్రీను దూరమయ్యేడనే వార్తలు వచ్చాయి.

ఐతే.. దీనిపై గెటప్ శ్రీను మాట్లాడుతూ.. మా టీమ్‌లో కొంత మంది కరోనా సోకడంతో నేను కొన్ని వారాలు ఈ షోను మిస్ అయ్యానంటూ చెప్పి.. వెంటనే మళ్లీ వచ్చేసాడు. ఇప్పుడు వరస స్కిట్స్‌తో రచ్చ చేస్తున్నాడు. పైగా ఈయన రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగానూ మారాడు. దాని కోసం తన లుక్ మొత్తం మార్చేసాడు. ఈ చిత్ర టీజర్ కూడా విడుదలైందిప్పుడు. దీనికి కూడా రెస్పాన్స్ బాగానే వస్తుంది. ఇందులో కూడా ఎక్కువగా గెటప్స్‌లోనే కనిపించాడు శ్రీను. మరి దీనితో ఆయనేం మాయ చేస్తాడో చూడాలి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Actor getup srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు