ఫోటో కోసం వెళ్లి... అలా సినిమా ఛాన్స్ కొట్టేసిన గెటప్ శ్రీను

jabardasth: ఆ ఫొటో వల్లే ఇస్మార్ట్ శంకర్ మూవీలో అవకాశం వచ్చిందని చెప్పాడు గెటప్ శ్రీను. జబర్దస్త్‌లో శ్రీను బాగా చేస్తాడని ఆకాశ్ చెప్పడంతో.. పూరి జగన్నాథ్ తన ముందే యూట్యూబ్‌లో స్కిట్‌లు చూశాడని తెలిపాడు.

news18-telugu
Updated: October 22, 2019, 9:09 AM IST
ఫోటో కోసం వెళ్లి... అలా సినిమా ఛాన్స్ కొట్టేసిన గెటప్ శ్రీను
పూరీ జగన్నాథ్, గెటప్ శ్రీను
  • Share this:
ట్యాలెంట్ ఎవడి సొత్తూ కాదు. ప్రతిభ ఉన్నోడికి ఎప్పటికైనా మంచి అవకాశాలు వస్తుంటాయి. ఐతే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎంత ట్యాలెంట్ ఉన్నా అంత ఈజీగా అవకాశాలు దొరకవు. ఎంతో కష్టపడితే తప్ప సినిమా ఛాన్సులు రావు. జబర్దస్త్‌లో దుమ్మురేపే గెటప్ శ్రీను కూడా ఇలాంటి కష్టాలే పడ్డాడట. అదెప్పుడో కెరీర్ ఆరంభంలో కాదు.. జబర్దస్త్‌లో మంచి స్థానంలో ఉన్నప్పుడు కూడా అలాంటివి ఎదురయ్యాయట. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ ఫ్రెండ్‌‌గా నటించిన గెటప్ శ్రీను.. తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

పూరి జగన్నాథ్ మానవత్వమున్న మంచి డైరెక్టరని ప్రశంసలు కురిపించాడు శ్రీను. పూరీ జగన్నాథ్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయనతో ఫొటో దిగేందుకు ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పాడు. ''ఒక సారి పూరి ఆఫీసుకు వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోమన్నారు. రెండో సార్లు వెళ్లినా అక్కడి నుంచి పంపించారు. ఒక్క ఫొటో దిగి వెళ్లిపోతా అని అడిగినా వినలేదు. సెక్యూరిటీతో మాట్లాడుతుండగా ఇంటిపై నుంచి ఆకాశ్ చూసి తనను గుర్తుపట్టాడు. శ్రీను సార్.. మీరేంటి ఇక్కడ..అని అడిగాడు. పూరీ సార్‌తో ఫొటో దిగేందుకు వచ్చానని చెప్పడంతో లోపలికి పిలిచారు.  అనంతరం పూరీ జగన్నాథ్‌కు పరిచయం చేయడంతో ఆయనతో ఫొటో తీసుకున్నా.'' అని శ్రీను తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఆ ఫొటో వల్లే ఇస్మార్ట్ శంకర్ మూవీలో అవకాశం వచ్చిందని చెప్పాడు గెటప్ శ్రీను. జబర్దస్త్‌లో శ్రీను బాగా చేస్తాడని ఆకాశ్ చెప్పడంతో.. పూరి జగన్నాథ్ తన ముందే యూట్యూబ్‌లో స్కిట్‌లు చూశాడని తెలిపాడు. ఇన్నాళ్లు ఎక్కడికి పోయావని.. చాలా అద్భుతంగా చేస్తున్నావని పూరీ పొగిడినట్లు శ్రీను పేర్కొన్నాడు. తన గెటప్‌లు పూరీకి ఎంతో నచ్చాయన్న శ్రీను..అదే రోజు సాయంత్రం పూరీ ఆఫీసు నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పడంతో మొదట నమ్మలేకపోయానని.. ఆ తర్వాత నిజమని తెలిసి ఎగిరి గంతేసానని చెప్పాడు శ్రీను.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>