జబర్దస్త్‌కు ఊహించని షాక్.. లాక్‌డౌన్ తర్వాత సీన్ రివర్స్

ప్రతీకాత్మక చిత్రం(Image:ETV Jabardasth)

యూబ్యూట్‌లోనూ వీరి స్కిట్స్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు వీరికి వచ్చినంత కాకపోయినా.. మిగతా వారి స్కిట్స్‌కు కూడా యూట్యూబ్‌లో మంచి ఆదరణ వస్తోంది. గతంతో పోల్చితే వ్యూస్ విపరీతంగా పెరిగాయి. అటు టీవీ రేటింగ్‌లోనూ జబర్దస్త్‌తో 'అదిరింది' పోటీ పడుతోందని తెలిసింది.

 • Share this:
  జబర్దస్త్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని కామెడీ షో. 2013లో ప్రారంభమైన ఈ ఖతర్నాక్ షో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అప్రతిహతంగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ ఏడేళ్లలో జబర్దస్త్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జడ్జి నాగబాబు జబర్దస్త్‌ను వదిలిపెట్టి జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షోకు జడ్జిగా పనిచేస్తున్నారు. ఆయన స్థానాన్ని జబర్దస్త్‌లో సింగర్ మనూ భర్తీ చేశారు. ఐతే జబర్దస్త్‌కు పోటీగా 'అదిరింది' షో వచ్చినప్పటికీ.. అందులో సీనియర్ కమెడియన్స్‌ని, పటాస్ స్టార్స్‌ని రంగంలోకి దించినప్పటికీ జబర్దస్త్‌ క్రేజ్ ఏం తగ్గలేదు. కానీ లాక్‌డౌన్ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్‌లో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. జిగేల్ జీవన్‌తో పాటు మరో టీమ్‌ని కూడా తీసేశారు. ఆ స్థానాల్లో తాగుబోతు రమేష్‌, షకలక శంకర్ టీమ్స్ వచ్చేశాయి. ఐతే లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్‌లో మునుప్పటి జోష్ కనిపించడం లేదని.. గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్‌లో హైపర్ ఆది, శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ తప్ప మిగతా స్కిట్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆది, సుధీర్ స్కిట్స్ మినహా మిగిలిన టీమ్‌లకు యూట్యూబ్‌లో పెద్దగా వ్యూస్ రావడం లేదని చెబుతున్నారు. కానీ అదే క్రమంలో అదిరింది షో దూసుకుపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  లాక్‌డౌన్ తర్వాత అదిరింది షోలో ఒకే ఒక్క మార్పు చేశారు. ఆర్పీ టీమ్‌ని పక్కన బెట్టారు. ధన్‌రాజ్, చంద్ర, వేణు, సద్దాం, హరి టీమ్స్‌తో షోను నడిపిస్తున్నారు. ఐతే వీరిలో సద్దాం టీమ్ గల్లీ బాయ్స్, హరి టీమ్ రౌడీ బాయ్స్ అదరగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూబ్యూట్‌లోనూ వీరి స్కిట్స్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు వీరికి వచ్చినంత కాకపోయినా.. మిగతా వారి స్కిట్స్‌కు కూడా యూట్యూబ్‌లో మంచి ఆదరణ వస్తోంది. గతంతో పోల్చితే వ్యూస్ విపరీతంగా పెరిగాయి. అటు టీవీ రేటింగ్‌లోనూ జబర్దస్త్‌తో 'అదిరింది' పోటీ పడుతోందని తెలిసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్‌కు నిజంగానే ఊహించని షాక్ తగులిందని.. అదే క్రమంలో అదిరింది షో మెల్లగా పుంజుకుంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: