హైపర్ ఆది గుట్టు విప్పిన గెటప్ శ్రీను.. అందరి ముందే..

యూటర్న్ అంటే.. ఒక దగ్గర్ సైన్ పెట్టి.. అక్కడ దాకా వెళ్లకుండా.. ఇటు వచ్చాశారు చూశావా.. అదే అంటూ సెటైర్లు వేశాడు. ఆ మ్యాటర్ అర్ధమై సైలెంట్ అవుతాడు ఆది.

యూటర్న్ అంటే.. ఒక దగ్గర్ సైన్ పెట్టి.. అక్కడ దాకా వెళ్లకుండా.. ఇటు వచ్చాశారు చూశావా.. అదే అంటూ సెటైర్లు వేశాడు. ఆ మ్యాటర్ అర్ధమై సైలెంట్ అవుతాడు ఆది.

 • Share this:
  జబర్దస్త్‌ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత.. ఆ కామెడీ షో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ యాజమాన్యం తీరు నచ్చక షో నుంచి బయటకొచ్చిన నాగబాబు.. జీ తెలుగులో 'అదిరింది' షోతో ముందుకొచ్చారు. ఐతే ఆ షోలో ప్రస్తుతం ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర టీమ్ లీడర్‌లుగా ఉన్నారు. జబర్దస్త్ నుంచి ఇంకొందరు వెళ్తారని ప్రచారం జరిగింది. ప్రచారం మాత్రమే కాదు.. నిజంగానే కొందరు టీమ్ లీడర్లు అదిరింది షోకు వెళ్దామనుకున్నారట. ఆ విషయం న్యూఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే ఈవెంట్‌ ద్వారా తెలిసింది.

  ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే షోకు వర్షిణి, హైపర్ ఆది వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ క్రమంలో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ను వేదికపైకి పిలిచారు. 'స్వైప్ లెఫ్ట్' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి వచ్చాడు గెటప్ శ్రీను. అది చూసిన ఆది.. ఇదేంటని అడిగాడు. దీనికి రైట్ కూడా ఉంటుందని షర్ట్‌పై రబ్ చేసి చూపించాడు శీను. దాంతో అది 'స్వైప్ రైట్‌'గా కనిపిస్తుంది. మరి ఇందులో యూటర్న్ కూడా ఉంటుందా.. అని హైపర్ ఆది అడిగాడు. వెంటనే రియాక్ట్ ఐన శీను.. యూటర్న్అంటే ఏంటో తెలుసా..? అని మొదలుపెట్టి ఆదిపై పంచ్‌లు విసిరాడు. యూటర్న్ అంటే.. ఒక దగ్గర్ సైన్ పెట్టి.. అక్కడ దాకా వెళ్లకుండా.. ఇటు వచ్చాశారు చూశావా.. అదే అంటూ సెటైర్లు వేశాడు. ఆ మ్యాటర్ అర్ధమై సైలెంట్ అవుతాడు ఆది.

  రోజా, యాంకర్లు వర్షిణి, విష్ణుప్రియ సహా అందరూ పగలబడి నవ్వుతారు. ఆ యూటర్న్ మ్యాటరేంటో మాకూ చెప్పాలని రోజా అడుగుతారు. ఆది కలగజేసుకొని.. ఇప్పుడది టాపిక్ కాదని డైవర్ట్ చేస్తాడు. ఈ పంచ్‌ వెనక పెద్ద కథే ఉన్నట్లు సమాచారం. హైపర్ ఆది 'అదిరింది' షోకు సైన్ చేసి.. ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడని, మళ్లీ జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడని సినీ వర్గాల సమాచారం. ఆ విషయంపైనే 'ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే' షోలో ఆదిపై గెటప్ శ్రీను పంచ్‌లు వేసినట్లు చర్చ జరుగుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: