Home /News /movies /

JABARDASTH EMMANUEL IS MY HUSBAND AND VARSHA IS HIS SECOND WIFE SAYS JABARDASTH BEAUTY SAI PK

Jabardasth Emmanuel: ఇమ్మాన్యుయేల్ నా మొగుడు.. వర్ష రెండో భార్య.. జబర్దస్త్ బ్యూటీ సంచలనం..

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్  (jabardasth emmanuel varsha)

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ (jabardasth emmanuel varsha)

Jabardasth Emmanuel: జబర్దస్త్ కామెడీ షోలో చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది అందరికంటే ముందున్నాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈయన ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈయన కంటే ముందున్న వాళ్లు..

జబర్దస్త్ కామెడీ షోలో చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది అందరికంటే ముందున్నాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈయన ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈయన కంటే ముందున్న వాళ్లు.. ఈయన తర్వాత వచ్చిన వాళ్లకు కూడా ఆది అంత క్రేజ్ రాలేదు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మాదిరే ఈ మధ్య మరో కమెడియన్ కూడా దూసుకుపోతున్నాడు. అతడి పేరు ఇమ్మాన్యుయేల్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు ఇమ్మాన్యుయేల్. ఈయన జోరు చూస్తుంటే ఇహనో ఇప్పుడో టీమ్ లీడర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. దాంతో పాటు సీరియల్ బ్యూటీ వర్షతో సీరియస్ లవ్ ట్రాక్ కూడా ఈయన్ని హెడ్ లైన్స్‌లో నిలబెడుతుంది. ఎప్పటికప్పుడు వర్షతో ఈయన చేసే రొమాన్స్ హైలైట్ అవుతుంది. దాంతో మనోడు ఆటోమేటిక్‌గా సంచలనం అవుతున్నాడు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ మనోడు మాత్రం తెర వెనక చాలా చిలిపి అంతే. ఇప్పుడు మరో జబర్దస్త్ బ్యూటీ కూడా ఇమ్మాన్యుయేల్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇక్కడ బ్యూటీ అంటే లేడీ గెటప్స్ కమెడియన్ అన్నమాట. సాయిలేఖగా ప్రేక్షకులను పరిచయం అయిన సాయి ఇప్పుడు ఇమ్మాన్యుయేల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అసలు వీళ్ళంతా అబ్బాయిలుగా ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.
jabardasth comedy show,jabardasth sai,jabardasth sailekha,jabardasth comedians,jabardasth skits,jabardasth emmanuel,jabardasth sai husband emmanuel,jabardasth lady getup sai,extra jabardasth comedy show,telugu cinema,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,జబర్దస్త్ వర్ష,జబర్దస్త్ సాయి లేఖ,జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (jabardasth emmanuel)

శాంతి స్వరూప్, తన్మయ్, వినోదిని లాంటి వాళ్లంతా అమ్మాయిలుగా మారిపోయారంతే. ఎప్పుడో కానీ ఒరిజినల్ గెటప్స్‌లో బయటికి రారు. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ సాయి కూడా తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయాడు. వయసు దాటిపోతుంది కదా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని యాంకర్ అడిగితే.. చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదని సమాధానమిచ్చాడు. అయితే తనకు రోజూ పెళ్లి అవుతూనే ఉంటుందని.. నిత్యకళ్యాణం జరుగుతుంటుందని చెప్పాడు సాయి. అయితే నువ్వు అమ్మాయిని చేసుకుంటావా.. అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని యాంకర్ మరో చిలిపి ప్రశ్న అడిగాడు.

దాంతో వెంటనే సాయిలేఖ అయితే అబ్బాయిని చేసుకుంటా.. సాయి అయితే అమ్మాయిని చేసుకుంటానని చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఇమ్మాన్యుయేల్‌కు ఎన్నో స్కిట్స్‌లో తాను భార్యగా చేసానని.. దాంతో తనే నా మొగుడు అంటూ చెప్పాడు సాయి. మరి వర్ష పరిస్థితి ఏంటి అంటే రెండో భార్య అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు జబర్దస్త్ సాయి. ఏదేమైనా కూడా ఇమ్మాన్యుయేల్ క్రేజ్ చూస్తుంటే మాత్రం మనోడు త్వరలోనే టీం లీడర్ కావడంతో పాటు సుడిగాలి సుధీర్ మాదిరే ఎఫైర్స్ రాజాగా కూడా మారిపోయేలా కనిపిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardast Varsha, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు