హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ అభిమానులకు భారీ షాక్.. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే..

జబర్దస్త్ అభిమానులకు భారీ షాక్.. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే..

ఇప్పుడు మళ్లీ ఈమె గ్యాప్ ఇస్తుంది. ఇంద్రజను తీసుకొచ్చి కవర్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆర్నెళ్లకు పైగా కష్టపడితే మనో దొరికాడు. మళ్లీ ఇప్పుడు రోజా కానీ మానేసిందంటే మాత్రం మరో జడ్జి కోసం తల పట్టుకోవాల్సిందే.

ఇప్పుడు మళ్లీ ఈమె గ్యాప్ ఇస్తుంది. ఇంద్రజను తీసుకొచ్చి కవర్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆర్నెళ్లకు పైగా కష్టపడితే మనో దొరికాడు. మళ్లీ ఇప్పుడు రోజా కానీ మానేసిందంటే మాత్రం మరో జడ్జి కోసం తల పట్టుకోవాల్సిందే.

Jabardasth Comedy Show: అనుకున్నంతా అయింది.. జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా దెబ్బ తింటున్నాయి. లాక్‌డౌన్ ప్రభావం కనిపిస్తుంది. జబర్దస్త్ కూడా దీనికి మినహాయింపు కాదు.

అనుకున్నంతా అయింది.. జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా దెబ్బ తింటున్నాయి. లాక్‌డౌన్ ప్రభావం కనిపిస్తుంది. జబర్దస్త్ కూడా దీనికి మినహాయింపు కాదు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత కూడా రెండు వారాలు కొత్త ఎపిసోడ్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా సీన్ మారిపోయింది. ఈ కామెడీ షోతో ఎంతోమంది కడుపు నింపుకుంటున్నారు. కేవలం కమెడియన్లు మాత్రమే కాకుండా అందులో పని చేసే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వందల మంది దీనికోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. లాక్‌డౌన్ కావడంతో ఇల్లు దాటి ఎవరూ బయటికి రావడం లేదు. ఎవరింట్లో వాళ్లు గప్ చుప్ అంటూ కూర్చున్నారు.

నటి రోజా (Jabardasth Comedy Show)
నటి రోజా (Jabardasth Comedy Show)

ఇప్పటికే రష్మి గౌతమ్, శ్రీముఖి, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్లంతా వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు గెటప్ శ్రీను కూడా ఇంట్లో అంట్లు తోముకుంటూ వీడియో పెట్టాడు. మిగిలిన వాళ్లు కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కామెడీ షో నెక్ట్స్ షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పటికే షూట్ చేసుకున్న ఎపిసోడ్స్ కూడా పూర్తి కావడంతో కొన్ని వారాలుగా పాత ఎపిసోడ్స్ ప్రసాచం చేస్తున్నారు. అయితే ఆదివారాలు కూడా అదిరిందికి పోటీగా జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ వేస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు గురు, శుక్రవారాలు కూడా పాత స్కిట్సే కావడంతో రేటింగ్స్ భారీగా పడిపోయాయి.

రష్మీ గౌతమ్, అనసూయ Photo ; Twitter
రష్మీ గౌతమ్, అనసూయ Photo ; Twitter

ఇప్పటికే స్లాట్స్ నింపడానికి ఒకప్పుడు చేసిన కామెడీ షోలతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి ఈవెంట్స్ రిపీట్ వేసుకుంటున్నారు. మూడు గంటలకు పైగా వీటితోనే కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కూడా ఆగిపోయింది. ఓవైపు జబర్దస్త్.. మరోవైపు ఎక్స్ ట్రా జబర్దస్త్‌ అన్నీ పాతదే కావడంతో తల పట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలు అంటూ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి ఇప్పట్లో జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ చూడటం సాధ్యమయ్యే పని కాదు.. మరి చూడాలిక ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..?

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు