జబర్ధస్త్ షోలో ఆలీ ప్లేస్‌‌ను రీప్లేస్ చేసిన ఫేమస్ కమెడియన్.. అది వెరైటీగా..

జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు తప్పుకున్నప్పటి నుంచి జడ్జ్‌గా ఆయనలేని లోటు కనపబడుతూనే ఉంది. ఈ వారం ఆలీ ప్లేస్‌లో మరో కమెడియన్ జబర్ధస్త్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ జడ్జ్‌గా కాకుండా.. కంటెస్టెంట్‌గా

news18-telugu
Updated: December 17, 2019, 4:04 PM IST
జబర్ధస్త్ షోలో ఆలీ ప్లేస్‌‌ను రీప్లేస్ చేసిన ఫేమస్ కమెడియన్.. అది వెరైటీగా..
జబర్ధస్త్ కామెడీ షోలో ’ఆలీ’ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు తప్పుకున్నప్పటి నుంచి జడ్జ్‌గా ఆయనలేని లోటు కనపబడుతూనే ఉంది. ఈ ప్రోగ్రామ్‌ను రోజా తనదైన జడ్జ్‌మెంట్‌తో ఒంటి చేత్తో లాక్కుంటూ వస్తోంది. ఐతే.. నాగబాబు ఎపుడైతే.. ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పాడో.. అప్పటి నుంచి ఎవరైనా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం జబర్దస్త్ షోకు వస్తే వాళ్లే ఆ సీటులో కూర్చుంటున్నారు. ఐతే.. రెండు వారాల నుంచి నాగబాబు ప్లేస్‌లో ఆలీ.. జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ వారం మాత్రం ఆలీ ప్లేస్‌లో యాంకర్‌గా ఉండే అనసూయ జడ్జ్‌‌గా హాట్ సీట్లో కూర్చుంది. తాజాగా ఆ వారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణమురళి..స్పెషల్ గా అలరించనున్నాడు. ఈయన జడ్జ్‌గా కాకుండా.. ఒక కంటెస్టెంట్‌గా ఓ స్కిట్ కూడా చేసి ఆడియన్స్‌ను అలరించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసారు. మొత్తానికి వెండితెరపై నటుడిగా సత్తా చూపెట్టిన పోసాని కృష్ణమురళి.. జబర్దస్త్ షో‌లో అదే ఊపు కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 17, 2019, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading