'జబర్దస్త్, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన కొత్త సినిమా 'సాఫ్ట్వేర్ సుధీర్'.ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ మెగాస్టార్ చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
'జబర్దస్త్, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన కొత్త సినిమా 'సాఫ్ట్వేర్ సుధీర్'.ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న 'సాఫ్ట్వేర్ సుధీర్' సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుడిగాలి సుధీర్.. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుభందాన్ని తలచుకుంటూ తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వివరించాడు. తాను కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి తన తమ్ముడితో కలసి వెళ్లానన్నారు. అంత పెద్ద స్టారైనా.. ఆసమయంలో చిరంజీవి గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారని సుధీర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ సమయంలో చిరంజీవిగారే ఈ పాలను కలిపి ఇవ్వటంతో జన్మ ధన్యమైపోయిందని సుధీర్ చెప్పాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు కొత్త బట్టలు ఇచ్చారని తెలిపాడు.తాను చిన్నప్పటినుంచి అభిమానించే హీరో చిరంజీవి.. ఇలా తనను అంతటి ప్రేమతో చూడడంతో కన్నీళ్లు ఆగలేదని సుధీర్ అన్నాడు. చిరంజీవి గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆయన చూపించిన ఆప్యాయత గురించి అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబుతూ గట్టిగా ఏడ్చేశానని సుధీర్ పేర్కొన్నాడు. ఈ విధంగా మెగాస్టార్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నానన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.