Jabardasth: జబర్దస్త్‌లో మార్పులు.. అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లడంతో ఆ కమెడియన్‌కు ప్రమోషన్..

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన నాగబాబు బయటికి వచ్చేసాడో కానీ అప్పట్నుంచి ఈ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం ఉన్నట్లు వచ్చే వారం కనిపించడం లేదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 23, 2020, 6:06 PM IST
Jabardasth: జబర్దస్త్‌లో మార్పులు.. అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లడంతో ఆ కమెడియన్‌కు ప్రమోషన్..
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన నాగబాబు బయటికి వచ్చేసాడో కానీ అప్పట్నుంచి ఈ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం ఉన్నట్లు వచ్చే వారం కనిపించడం లేదు ఇప్పుడు ఈ షో. అవసరానికి తగ్గట్లుగా టీమ్ లీడర్స్‌తో పాటు ఇంకా చాలా మార్పులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక మార్పు కూడా చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ జబర్దస్త్ కామెడీ షోలో ఉన్న అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ షోకు వచ్చాడు. అందులో అందరితో కలిసిపోయిన జబర్దస్త్ రచ్చ చేస్తున్నాడు.
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


అక్కడ తన మార్క్ చూపించుకుంటున్నాడు ఈయన. దానికి ముందు జబర్దస్త్‌లో ఈయన టీమ్ లీడర్. కార్తిక్‌తో కలిసి ఓ టీం ఫామ్ చేసాడు అవినాష్. మాస్ అవినాష్ కెవ్వు కార్తిక్ పేరుతో ఓ టీమ్ గత నాలుగేళ్లుగా రన్ చేస్తున్నారు ఈ జోడీ. అయితే ఇప్పుడు అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లడంలో ఓ టీమ్ లీడర్ కుర్చీ ఖాళీ అయిపోయింది. దాంతో దాన్ని భర్తీ చేసే పనిలో బిజీ అయిపోయారు జబర్దస్త్ నిర్వాహకులు. ఇప్పటి వరకు ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఇప్పుడు దాన్ని సోలో చేసారు. మాస్ అవినాష్ బిగ్ బాస్‌లో బిజీ కావడంతో కెవ్వు కార్తిక్‌ను సోలో టీం లీడర్‌గా చేసారు.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu karthik/facebook)
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu karthik/facebook)

ఈ మార్పుతో చాలా కాలంగా కలలు కంటున్న కార్తిక్‌కు సోలో టీమ్ లీడర్ పదవి వచ్చినట్లైంది. రేటింగ్స్ బాగా వస్తే అవినాష్ వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తారేమో చూడాలి. ఇప్పటి వరకు అయితే అవినాష్ లేకపోయినా కూడా ఆ లోటు లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు కెవ్వు కార్తిక్. తొలి స్కిట్‌లోనే సోలో టీమ్ లీడర్ అయ్యానంటూ ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఈయన. ఏదేమైనా కూడా ఈ మార్పులు అన్నీ కూడా జబర్దస్త్ కామెడీ షోకు మంచి రేటింగ్స్ తీసుకొచ్చేలా పని చేస్తాయా లేదా అనేది చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: September 23, 2020, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading