జబర్దస్త్‌లో కరోనా కలకలం...ఆర్టిస్టులందరిలో భయం..భయం...

జబర్దస్త్ షూటింగ్ అంటే తమకు పండగ అని, జబర్దస్త్ నే నమ్ముకొని కొందరు ఆర్టిస్టులు తమ జీవితం గడుపుతున్నారు.

news18-telugu
Updated: March 27, 2020, 9:52 AM IST
జబర్దస్త్‌లో కరోనా కలకలం...ఆర్టిస్టులందరిలో భయం..భయం...
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
తెలుగు బుల్లితెర పరిశ్రమకు కరోనా కష్ట కాలం తెచ్చిపెట్టింది. అందుకు జబర్దస్త్ కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్ దెబ్బతో ఇఫ్పటికే షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. దీంతో జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ కూడా షూటింగ్ నిలిపి వేసినట్లు సమాచారం. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్టిస్టులంతా ఇప్పటికే ఇంటికి పరిమితం అయిపోయారు. అటు కొత్త ఎపిసోడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఆర్టిస్టులంతా ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం అని వాపోతున్నారు. జబర్దస్త్ షూటింగ్ అంటే తమకు పండగ అని, జబర్దస్త్ నే నమ్ముకొని కొందరు ఆర్టిస్టులు తమ జీవితం గడుపుతున్నారు. దీంతో అటు షూటింగులు లేక, ఈవెంట్స్ లేక జబర్దస్త్ ఆర్టిస్టులంతా విలవిలలాడుతున్నారని సమాచారం అందుతోంది. పెద్ద ఆర్టిస్టులు సుధీర్, హైపర్ ఆది, అనసూయ, రష్మీ లాంటి స్టార్ ఆర్టిస్టులకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా మిగితా చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఈ లాక్ డౌన్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎపిసోడ్ చొప్పున పేమెంట్ అందుకునే వీరంతా షూటింగులు లేకపోవడంతో తమ భవిష్యత్ ఎలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగులు లేని కారణంగా తమ యాజమాన్యమే పట్టించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు